*యోబు 22:28 “నీవు దేనినైన యోచనచేయగా అది నీకు స్థిరపరచబడును.”*
ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ అలసిపోయినవా?, అపనమ్మకంతో ప్రార్థిస్తున్నవా?, సమస్యల బరువుతో “నిజంగా దేవుడున్నాడా?” అని కృంగిపోయినవా? ఈ వాక్యం నీకు ఓ మృదువైన భరోసా ఇస్తుంది. దేవుడు నీకు దూరంగా లేడు; మన కన్నీళ్లను ఆయన లెక్కపెడతాడు. మనకు కనిపించని సమయంలో కూడా ఆయన కార్యం జరుగుతూనే ఉంటుంది.
ప్రార్థనకె ఫలితం ఆలస్యమైందని దేవుడు వినడంలేదని కాదు. మన ఆలోచనలను, మన నిర్ణయాలను ఆయన సన్నిధిలో ఉంచినప్పుడు, సరైన సమయములో ఆయన వాటిని స్థిరపరుస్తాడు. మన బలహీన విశ్వాసాన్ని కూడా దేవుడు త్రోసిపుచ్చడు; దయతో దాన్ని బలపరుస్తాడు.
కాబట్టి నీవు అలసిపోయినప్పటికి ప్రార్థనను వదలకు. నీలో అపనమ్మకం ఉన్నా దేవుని దగ్గరకు రండి. కృంగిన హృదయాన్ని ఆయన ఎత్తి నిలబెడతాడు. ఎందుకంటే దేవుని దయ మన పరిస్థితులకన్నా గొప్పది, మన సందేహాలకన్నా బలమైనది. ఆమేన్🙏
http://youtube.com/post/Ugkxm6DYRTQoXR47mpLeVX1dOvOy5zWVE5_W?si=yqRlNgXQ5KTKabGu #💪పాజిటీవ్ స్టోరీస్ #😇My Status #🌅శుభోదయం #🙆 Feel Good Status #✝జీసస్
*Plz Subscribe, Share, Like and Comment*


