ShareChat
click to see wallet page
search
ఎవరికి హ్యాపీనెస్ లేకుండా అన్యాయం గా నాశనం చేసుకున్నారు జీవితాన్ని కట్నం లేకపోతే brathakalera ఉన్న దానిలో వివాహమైన 45 రోజులకే కట్నం చిచ్చు: భార్య ఆత్మహత్య.. భయంతో భర్త బలవన్మరణం.. బెంగళూరుకు చెందిన సూరజ్ శివన్న(35), గానవిలకు నెలన్నర క్రితం వివాహం జరిగింది. అయితే, కట్నం వేధింపుల కారణంగా గానవి గురువారం ఆత్మహత్య చేసుకోవడం ఈ విషాదానికి కారణమైంది.గానవి మరణంతో ఆమె తల్లిదండ్రులు సూరజ్‌పై వరకట్న వేధింపుల కేసు పెట్టారు. పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భయం, గానవి బంధువుల నుంచి వస్తున్న ఒత్తిడి భరించలేక సూరజ్ తన తల్లి జయంతి, తమ్ముడితో కలిసి బెంగళూరు నుంచి పారిపోయాడు. హైదరాబాద్ మీదుగా నాగ్‌పూర్ చేరుకుని అక్కడ ఒక హోటల్‌లో తలదాచుకున్నాడు. అయితే, కేసుల గొడవలు, భార్య మరణం మిగిల్చిన వేదనతో సూరజ్ శుక్రవారం రాత్రి హోటల్ గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతదేహాన్ని చూసిన తల్లి జయంతి(60) గుండె పగిలి అక్కడే ఆత్మహత్యకు యత్నించింది. హోటల్ సిబ్బంది గుర్తించి ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. కేవలం 45 రోజుల క్రితం పెళ్లి వేడుకతో కళకళలాడిన ఆ రెండు ఇళ్లు ఇప్పుడు విషాదంలో మునిగిపోయాయి. #💪పాజిటీవ్ స్టోరీస్ #🥳Celebrations Video🎆 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #😴శుభరాత్రి #😁Hello🙋‍♂️
💪పాజిటీవ్ స్టోరీస్ - ShareChat