ShareChat
click to see wallet page
search
💐🌿🌹🙏👍 పెళ్లి పై నా ఆలోచనలు 🌹🌿💐 _________________________________________ పెళ్ళంటే ఒకరికి జీవితాన్ని ఇవ్వడం... జీతాన్ని ఇవ్వడం కాదు. నేను సంపాదించిన జీతం తో కులకటం కాదు. రెండు చేతులు కలిస్తే చప్పుడు అయినట్లు , భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తేనే జీవితం సుఖమయంగా , మన ఆశలకు , కోరికలకు అనుగుణంగా ముందుకు సాగుతుంది. ప్రస్తుత పరిస్థితులలో డబ్బు ఉంటేనే ఏదైనా చేయగలం .💐🌿🌹👍 పాతరోజులలో యజమాని కష్టపడేవాడు. ఇల్లాలు ఇంటిని చక్కదిద్దడం , భర్త బాగోగులు చూడడం , అత్తమామలను చూడడం , ఆడపడుచుల సౌఖ్యం చూడడం , ఇంటికి వచ్చిన చట్టాలను , పెద్దలను గౌరవంగా చూడడం , బంధువుల ప్రేమానురాగాలు పొందడం... పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చి దిద్దడం , భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ.. తెచ్చిన రూపాయిలో పది పైసలు నిల్వ చేయడం , ఉన్నంతలో దాన ధర్మాలు , పూజ పునస్కారాలతో , ఆచారాలతో , మహాలక్ష్మిలా ఇంటిని తీర్చిదిద్దడం..... ఇవే ఆరోజుల్లో ఇంటి ఇల్లాలు చేసే పనులు. 👍🌹🌿💐🙏😴😊 కానీ నేటి యువతులలో పై లక్షణాలు కానరావడంలేదు. పెళ్లి చేసుకున్నందుకు చచ్చినట్టు భర్తే చూడాలి అనే నిర్లక్ష్యపు ధోరణి కనిపిస్తుంది. పైగా భర్త సంపాదనతో పొద్దస్తమానం టీవీ , సెల్ , యూట్యూబ్ , సోషల్ మీడియా కి అలవాటు పడడం , భర్త బాగోగులు సరిగా చూడక పోవడం , అత్తమామలకు , ఆడపడుచులకు , సరైన మర్యాద ఇవ్వకపోవడం , నాగరికతకు అలవాటు పడడం , లేనిపోని ఆర్భాటాలు , ..ఇవే నేటి అమ్మాయిల మనస్తత్వం. 😊😴🙏💐🌿🌹 భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తేనే ... వారు కోరుకున్న గమ్యం చేరుకునే అవకాశం ఉంది. పిల్లలను ప్రయోజకులను చేయడం , తినటానికి , ఉండటానికి చక్కని వసతులు సమకూర్చుకోవడం , తద్వారా జీవనం సాఫీగా , సంతోషంగా , ఆనందంగా 80 సంవత్సరాలు వచ్చేవరకు బ్రతకడానికి వీలుపడుతుంది. _________________________________________ HARI BABU.G _______________________________________ #🌅శుభోదయం #✌️నేటి నా స్టేటస్ #🤝Have a Good Day🤩 #💗నా మనస్సు లోని మాట #✍️నా మది అంతరంగం💜
🌅శుభోదయం - ShareChat