*గ్రామ స్వచ్ఛతే లక్ష్యంగా ఎమ్మెల్యే అడుగులు – పారిశుధ్య కార్మికుల పక్షాన నిలిచిన జారె ఆదినారాయణ*
23.01.2026 (శుక్రవారం)
దమ్మపేట మండలం మందలపల్లి సెంటర్‌లో శుక్రవారం ఉదయం ప్రత్యేక దృశ్యం కనిపించింది.
గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులు వీధులు శుభ్రం చేస్తున్న వేళ గౌరవ *ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు స్వయంగా* వారి వెంట చేరి చీపురు పట్టి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు.
గ్రామాల పరిశుభ్రత కోసం ఎండా వానా చూడకుండా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు అమూల్యమని ఎమ్మెల్యే ప్రశంసించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వారి పాత్ర కీలకమని పేర్కొంటూ, కార్మికులకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా కార్మికులతో కాసేపు ముచ్చటించిన ఎమ్మెల్యే, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. వారి ఇబ్బందులను *ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీ వేదికగా ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు.*
గ్రామ స్వచ్ఛతపై తన నిబద్ధతను మరోసారి చాటుకున్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారి ఈ చర్యకు స్థానికుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. #🏛️రాజకీయాలు #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్


