ShareChat
click to see wallet page
search
*ఆ దాపరికమే నీ జీవితాన్ని మట్టిపాలు చేసేస్తుంది..!!* భర్తకు తెలియకుండా భార్యలు. భార్యకు తెలియకుండా భర్తలు. తల్లిదండ్రులకు తెలియకుండా కొడుకులు, కుమార్తెలు. కుమారులు, కుమార్తెలకు తెలియకుండా తల్లిదండ్రులు. అత్తామామలకు తెలియకుండా కోడళ్లు... పాపిష్టి పనులు చేస్తూ, అలాగే చేయకూడని పనులు చేస్తూ... దాపరికాల్లో మునిగితేలుతున్నారు. చివరికి ఆ దాపరికాలే వారి జీవితాలను సర్వనాశనం చేస్తున్నాయి. దాపరికం అనేది మనిషిని ఎంత నీచమైన స్థితికైనా దిగజారుస్తుందనే విషయాన్ని గుర్తిస్తే చాలా మంచిది. ఆ రోజు అవ్వ, ఆదాము దాపరికమే వారి నాశనానికి దారితీసింది. అలాగే ఆ రోజు కయీనూ దాపరికమే.. దేశదిమ్మరిగా ముద్రించాల్సి వచ్చింది. అవును ఈ రోజుల్లో చాలామంది జీవితాలు నాశనం కావడానికి కారణం... దాపరికమే. ఆ దాపరికం వల్లే కుటుంబాలు విచ్ఛినం అవుతున్నాయి. ఆ దాపరికమే కలిసివుండవల్చిన భార్యభర్తలు ఎడబాసి వుంటున్నారు. ఆ దాపరికంతోనే ఎంతో మంది కోడళ్లు అత్తామమలకు దూరంగా ఉంటూ... సమాజంలో విలువలేని జీవితాలు ఎంతోమంది జీవిస్తున్నారు. ఆ దాపరికాలతో ఎంతోమంది కొడుకులు తల్లిదండ్రులకు దూరమైపోతున్నారు. ఆ దాపరికాలతోనే ఎంతో మంది తల్లులు, తండ్రులు కొడుకులకు, కుమార్తెలకు దూరంగా జీవిస్తూ... అంధకారంలో మగ్గిపోతున్నారు. ఉద్యోగం అంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లిన భార్యలు తమ ఇష్టానుసారంగా జీవిస్తూ... తమ శరీరాలను తాకట్టు పెడుతూ.. బరితెగిస్తూ.. జీవించే వారు చాలామంది వున్నారు. ఇప్పటివరకు ఏం చేశావ్? అని భర్త ప్రశ్నిస్తే... తను చేసిన ఆ పాపిష్టి పనులను దాస్తూ... ఏమీ తెలియనట్టుగా తమ భర్తలకు మాయ మాటలు చెబుతూ... ఎంతమంది దాపరికంలో మగ్గిపోవడం లేదు. ఈ బంగారం ఎక్కడిది? ఇన్ని చీరలు ఎలా కొంటున్నావు?, ఇంత డబ్బు నీకు ఎక్కడనుంచి వస్తుంది? అని భర్త ప్రశ్నిస్తే... అసలు విషయాలను కప్పెస్తూ... దాచేస్తూ... ఏవేవో చెబుతూ.. తమ భర్తల కళ్లను కప్పే భార్యలు ఎంతమంది లేరు. అలాగే ఇప్పటివరకు ఎక్కడి పోయావు అని తమ భర్తలను భార్యలు ప్రశ్నిస్తే... బయటకు వెళ్ళి ఎన్నో పాడు పనులు చేస్తూ... మాయ మాటలతో తమ భార్యలను మోసం చేసే భర్తలు ఎంతమంది లేరు. బయట ఎదో పని వుందని చెప్పి... ఇంటి నుంచి బయటకు వెళ్లిన భర్తలు... ఎంతమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేయడం లేదు. ఎన్ని గబ్బు పనులు చేయడం లేదు. ప్రశ్నించిన భార్యకు మాయమాటలు చెప్పి ఎంతమంది భర్తలు కాలాన్ని గడిపేయడం లేదు. అలాగే కోడళ్లు విషయానికొస్తే... ఇప్పటివరకు ఎక్కడకు వెళ్ళావు అని అత్తామామలు ప్రశ్నిస్తే... బయట చేస్తున్న ఆ పాడు పనులను కప్పెడుతూ.. దాచిపెడుతూ... అత్తామామలను మోసం చేసే కోడళ్లు ఎంతమంది లేరు. బయటకు వెళ్లి ఏం చేశావ్? ఇప్పటివరకు ఎక్కడి వెళ్లావు? అమ్మా, నాన్న అని కొడుకులు, కుమార్తెలు ప్రశ్నిస్తే... పరాయి పురుషులతో, పరాయి స్త్రీలతో చేస్తున్న ఆ అడ్డమైన పనులను దాచిపెడుతూ... ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డలను మోసం చేయడం లేదు. కాలేజీ అంటూ వెళ్తున్నావు?, ట్యూషన్ అంటూ ఇంటినుంచి బయటకు వెళ్తున్నావు? కోచింగ్ సెంటర్ అంటూ వెళ్తున్నావు? స్కూల్ అంటూ వెళ్తున్నావ్? అలాగే ఏదో పనంటూ బయటకు వెళ్తున్నావు? ఇంత సమయం వరకు ఏం చేశావ్? అని తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రశ్నిస్తే.... బయట చేస్తున్న ఆ గబ్బు పనులను, ఆ వ్యభిచారాన్ని, ఆ తిరుగుబోతు తనాన్ని దాచిపెడుతూ... తమ తల్లిదండ్రులను మాయ చేసే బిడ్డలు ఎంతమంది లేరు. జాగ్రత్తగా వినండి..!! తమ తమ్ముడిని చంపిన కయీనును దేవుడు ప్రశ్నించాడు. కయీనూ నీ తమ్ముడు ఎక్కడ? అంటే చేసి ఆ పాపాన్ని దాచిపెట్టి, ఏం తెలియనట్టుగానే దేవునికి మాయమాటలు చెప్పాడు. చేసిన ఆ పాపాన్ని ఒప్పుకోకుండా... ఆ పాపాన్ని దాచిపెట్టిన విధానమే అతన్ని జీవితాన్ని నాశనం చేసింది. అలాగే అవ్వను, ఆదామును దేవుడు ప్రశ్నించాడు. ఆదామా..? ఎందుకు ఆ పండు తిన్నావు? అంటే... చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా... దాచిపెట్టేశాడు... ఆ దాపరికమే ఆదాము, అవ్వల జీవితం నాశనమైంది. నీ భర్త వద్ద లేక నీ భార్య వద్ద, నీ బిడ్డల వద్ద, అలాగే నీ అత్తామామల వద్ద, నీ కోడళ్లు వద్ద పాపాన్ని దాచిపెడుతూ... ఎదురు మాటలు మాట్లాడుతున్నావేమో... జాగ్రత్త... ఆ రోజు కయీను, ఆదాము, అవ్వలకు పట్టిన గతే నీకు పడుంది. నీ పాపిష్టి జీవిత దాపరికాన్ని బట్టి శిక్ష అనుభవివిస్తున్నావేమో..!! ఎందుకని నీ యొక్క పాపాన్ని దేవుని వద్ద ఒప్పుకుని మరల నూతన జీవితం జీవించకూడదు..!! ‘‘యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను నడుగగా అతడు నేనెరుగను; నా తమ్మునికి నేను కావలివాడనా అనెను.’’ (ఆది 4:9). (ఇక్కడ కయీను తమ్ముడిని చంపిన విషయాన్ని దాచిపెట్టాడు). ‘‘నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? అని అడిగెను. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిననెను.’’ (ఆది 3:11,12). (ఇక్కడ ఆదాము చేసిన తప్పును దాచిపెట్టాడు. ఆ తప్పును ఒప్పుకోకుండా తన భార్యపైకి నెట్టేశాడు.). ************************************* *ప్రతిదినం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ గ్రూప్స్...!* *WhatsApp Community - 1 link:* https://chat.whatsapp.com/BKEcChdxaKrK0dJ8CqADcD *************************************** *Telegram group Link* https://t.me/+XtII92fKOXAyNWQ9 ******************************** *యూట్యూబ్ ఛానల్ లింకు* https://www.youtube.com/@calvarykiranalu-l7t ******************************** *మీ ప్రార్దన అవసరతను నా నెంబర్ కు మెసేజ్ చేయండి.... మీ ప్రార్దన మనవిని మన అన్నీ గ్రూప్స్ లో నేనే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీ సమస్యపై మన గ్రూప్స్ సభ్యులందరూ ప్రార్దన చేస్తారు. మనకు కావల్చింది వాక్యం, ప్రార్దన.* *- మీ సహోదరుడు మోషే* *- (Calvary Kiranalu )* *-(📲 9550576444)* ************************************ #✝️Jesu✝️ #jesu #యేసు ప్రభువు #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #i love jesu #Jesus
✝️Jesu✝️ - ShareChat