సాయితత్వంలో అద్భుతమైన శాంతి ఉంది. తేజోవంతమైన కాంతి ఉంది. అన్యోన్యమైన ప్రేమ ఉంది. బాబా పలుకుల్లో అమృతం ఉంది.
సాయి బంధువులకు అవి ఆయాచితంగా లభించే వరాలు... బతికున్నంత కాలం చివరి శ్వాస వరకు ఏదో విధంగా ఎంతో కొంత కూడబెట్టాలన్నదే మనిషి ఆశ. సంపాదించుకోవటం, ఆస్తులు పోగెయ్యటం తప్పు కాదు
కానీ, తను సంపాదించినదంతా తనదేనని, తానే అనుభవించాలని అనుకోవటం మాత్రం స్వార్థం అనిపించుకుంటుంది...
పోయేటపుడు మూటగట్టుకుపోయేదేదీ ఉండదనే నిజం తెలుసుకోవటానికి మనస్కరించదు. అది కూడా స్వార్థ ప్రభావమే...
నీకున్న సంపదను స్వయంగా నువ్వు అనుభవించు. అలాగే కాస్త మనసును విశాలం చేసుకుని నీ పక్కనున్న వారిని కూడా అనుభవించనివ్వు. నీ చుట్టూ ఉన్న వారెవరైనా ఆకలితో అలమటిస్తుంటే కనుక వారి కడుపు నింపటానికి తగిన సాయం చెయ్యి.
ఈ చిన్న పని కూడా చెయ్యలేకుంటే నువ్వు కష్టపడి సంపాదించిన ఆస్తంతా ఏ ఫలం లేకుండానే నిష్ఫలమవుతుంది.
భగవంతుని అవతారాలు బాబాకు ఉన్నంత సామాజిక దృక్పథం, మానవతా వాదం మరే అవతారాల్లోనూ లేవు. మనసును కాస్త మంచి చేసుకుంటే మనిషి మనీషి అవుతాడు
నా' అనుకోవటంలో ఒక్కరి ఆనందమే ఇమిడి ఉంది. 'మన' అనుకోవటంలో అందరి ఆనందం ఉంది.* సాయిమార్గంలో పయనించాలంటే ఒక్కొక్క అవలక్షణాన్నీ సులక్షణంగా మార్చుకోవాలి.
అందుకోసం భక్తి, శ్రద్ధ, విశ్వాసం, సహనం అలవర్చుకోవాలి. అపుడే సాయి మార్గంలో పయనించగలం... #🕉 ఓం సాయిరామ్😇 #🙏🏼షిరిడి సాయి బాబా


