రేపు కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
•గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి సానుకూల స్పందన, శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో టి.టి.డి. నిధులు మంజూరు
•టి.టి.డి. నుంచి రూ.35.19 కోట్ల నిధులతో సత్రం, దీక్షా విరమణ మండపం నిర్మాణాలకు శంకుస్థాపన
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొండగట్టును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం దర్శించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం సమకూర్చే నిధులతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10గం.30ని. నుంచి 11 గం.30ని. మధ్య ఈ కార్యక్రమాలు ఉంటాయి. కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇలవేల్పుగా భక్తితో కొలుస్తారు.
# #🟥జనసేన #👊పొలిటికల్ ఫైట్స్🎤 #🧓నరేంద్ర మోడీ #😴శుభరాత్రి #🛕అయోధ్య రామ మందిరం🙏

