ShareChat
click to see wallet page
search
శ్రీశైలాన్ని ఏ మాసంలో దర్శిస్తే ఏం ఫలం శ్రీ శైల శైలమహాక్షేత్రం మహిమాన్వితమైనది. ఈ క్షేత్రం యొక్క దివ్యశక్తి అమోఘం. భౌతిక ఇంద్రియాలతో మనం చూడలేని దివ్యత్వం శ్రీశైలములో అణువణువునా వ్యాపించి వుంది. ఎన్నో జన్మల పుణ్యఫలితం వలన మాత్రమే శ్రీశైల దర్శనభాగ్యం కలుగుతుందని స్కాందపురాణములోని శ్రీశైలఖండం చెబుతోంది. ఈ క్షేత్రాన్ని ఏ మాసములో దర్శిస్తే ఏ ఫలితం లభిస్తుందన్న విషయాన్ని శ్రీపర్వతపురాణం యిలా చెప్పింది. 1. చైత్రమాసం సకల శుభాలు కలుగుతాయి. బహుయజ్ఞాలు ఆచరించిన ఫలం లభిస్తుంది. ఆయుష్షు పెరుగుతుంది. 2. వైశాఖ మాసం కష్టాలు తీరుతాయి. లక్షగోవులను దానం చేసినంత ఫలం లభిస్తుంది. 3. జ్యేష్ఠ మాసం కోరికలు నెరవేరుతాయి. లక్షగోవులను బంగారంతో అలంకరించి దానం చేసినంత ఫలం లభిస్తుంది. 4. ఆషాఢ మాసం కోటిగోవులను శివాలయానికి దానమిచ్చినంత ఫలం లభిస్తుంది. బంగారు రాశులను దానం చేసిన ఫలం వస్తుంది. 5. శ్రావణమాసం యోజనం పొలమును పంటతో సహా పండితునికి దానం చేసినంత ఫలితం లభిస్తుంది. 6. భాద్రపదమాసం పండితులకు కోటి కపిల ఆవులను దానం చేసిన ఫలం లభిస్తుంది. 7. ఆశ్వయుజమాసం పాపాలన్ని హరించబడతాయి, అప్లైశ్వర్యాలు లభిస్తాయి. వేయి కన్యాదానాలు చేసిన ఫలం లభిస్తుంది. 8. కార్తిక మాసం యజ్ఞాలలో ఎంతో గొప్పదిగా చెప్పబడే వేయి వాజపేయ యాగాలు చేసినంత ఫలం లభిస్తుంది. 9. మార్గశిర మాసం పాపాలు తొలగిపోతాయి. పౌండరీకయాగం చేసినంత ఫలం లభిస్తుంది. 10. పుష్యమాసం పాపాలు హరించబడి మోక్షం లభిస్తుంది. అతిరాత్రయాగం చేసినంత ఫలితం కలుగుతుంది. 11. మాఘమాసం శ్రేయస్సు కలుగుతుంది రాజసూయయాగం చేసిన ఫలం లభిస్తుంది. 12. ఫాల్గుణమాసం తరగని సంపదలు కలుగుతాయి. సౌత్రామణి యాగఫలం, ఎనలేని పుణ్యాన్ని పొందవచ్చు. _________________________________________ HARI BABU.G ________________________________________ #😇శివ లీలలు✨ #🛕శివాలయ దర్శనం #🙏ఓం నమః శివాయ🙏ૐ #శ్రీశైల మల్లిఖార్జున - జ్యోతిర్లింగమ్ #🙏🏻సోమవారం భక్తి స్పెషల్
😇శివ లీలలు✨ - ಆಧಯಾಲ್ಿ5ಆನಂದಂ 8 0332 ಆಧಯಾಲ್ಿ5ಆನಂದಂ 8 0332 - ShareChat