ShareChat
click to see wallet page
search
💚song:750💚 పల్లవి: M ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా F ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా M నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమా F మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమా M కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమా F నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమా M ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా.. F ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా..ఆ.. చరణం 1: M కాలమొస్తే సిరిమల్లె తీగకి చిగురే పుడుతుంది F ఈడు వస్తే ఈ పడుచు గుండెలో ప్రేమే పుడుతుంది M గొడుగు అడ్డుపెట్టినంతనే వాన జల్లు ఆగిపోవునా F గులకరాయి వేసినంతనే వరద జోరు ఆగిపోవునా M ఏడు లోకాలు ఏకం అయినా ప్రేమను ఆపేనా..ఆ.. F ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా.. M ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా.. చరణం 2: F ప్రేమ అంటే ఆ దేవుడిచ్చిన చక్కని వరమంటా.. M ప్రేమ ఉంటే ఈ మనసుకెప్పుడూ అలుపే రాదంట F కండలెంత పెంచుకొచ్చినా కొండనెత్తి దించలేరురా M కక్షతోటి కాలు దువ్వినా ప్రేమనెవ్వరాపలేరుగా F ప్రేమకెపుడైనా జయమే గాని ఓటమి లేదంట..ఆ M ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా F ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా.. M నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమా F మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమా M కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమా F నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమా శాశ్వతమీ ప్రేమా.. 💚Bujji123💚😍💃🎶🎵🎵😍💃💚 Movie : Jayam Lyrics : Kulasekhar Music : R P Patnaik Singers: R P Patnaik, Usha #✌️నేటి నా స్టేటస్ #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #😇My Status