*ప్రెస్ నోట్*
*గుంటూరు జిల్లా పోలీస్...*
*నగరం పాలెం పోలీస్ స్టేషన్...*
*ది.30.12.2025*
_*//గంజాయి కేసులో నిందితుడి అరెస్ట్. 2 కేజీల గంజాయి స్వాధీనం.//*_
🚩 గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు వెస్ట్ సబ్–డివిజన్ డీఎస్పీ శ్రీ కె. అరవింద్ గారి పర్యవేక్షణలో, నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయాలపై ప్రత్యేక నిఘా నిర్వహించగా, ఒక ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగినది.
👉 *అరెస్ట్ కాబడిన నిందితుడు వివరాలు:* వాసిమళ్ళ వంశీకృష్ణ, తండ్రి: సత్యానందం, వయస్సు: 25 సం.లు, చుట్టుగుంట, లక్ష్మినారాయణపురం,గుంటూరు నగరం. *(నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్ కలదు)*
🔅*కేసు వివరాలు :* A1 మరియు అతని స్నేహితులు మద్యం, సిగరెట్, గంజాయి వంటి చెడు అలవాట్లకు బానిసలై, డబ్బుల అవసరాల కోసం గంజాయి అమ్మకం ద్వారా అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో, అక్టోబర్–2025లో విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి రూ.3,000/-లకు 3 కిలోల గంజాయి కొనుగోలు చేసి గుంటూరు వచ్చారు.
🔅అందులో A1 రెండు కిలోల గంజాయి తన వద్ద ఉంచుకోగా, మిగిలిన ఒక కిలో గంజాయిని ఇతర నిందితులు పంచుకున్నారు. ఈ క్రమంలో, ది. 29.12.2025 సాయంత్రం సుమారు 7.00 గంటల సమయంలో, A1 నిందితుడు నగరంపాలెం పరిధిలోని కృష్ణబాబు కాలనీ గడ్డి పొలాల వద్ద గంజాయిని విక్రయించేందుకు వచ్చి, సిగరెట్‌లో గంజాయి పెట్టి సేవిస్తున్న సమయంలో నగరంపాలెం పోలీసులు పట్టుకున్నారు అని ఈ రోజు(30.12.2025) వెస్ట్ డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిఎస్పీ అరవింద్ గారు తెలిపారు.
🔅A1 వద్ద నుంచి 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని, అతన్ని అరెస్ట్ చేసి, Cr. No: 504/2025
U/s 8(c) r/w 20(b)(ii)(B) NDPS Act – 1985 of Nagaram palem ps కేసు నమోదు చేయడం జరిగింది.
📌 *ఈ కేసులో కొంతమంది నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉంది.*
👉 నిందితుడి మీద నగరం పాలెం, మేడికొండూరు, నల్లపాడు, ఫిరంగిపురం పోలీస్ స్టేషన్లలో మొత్తం 14 కేసులు నమోదవగా, 07 కేసుల్లో NBWలు పెండింగ్‌లో ఉన్నవి.
👉 *కేసు దర్యాప్తులో సహకరించిన పోలీస్ అధికారులు మరియు సిబ్బంది:* నగరంపాలెం సీఐ సత్యనారాయణ గారు, ఎస్సై రాంబాబు గారు, ఎస్.కే. జాన్ సైదా, ఎ. శ్రీనివాసరావు, పి. గంగరాజు, ఎం. దాసు, ఉదయ్ చంద్.
👉 ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు వెస్ట్ సబ్–డివిజన్ పరిధిలో గంజాయి విక్రయం, వినియోగం, రవాణా లేదా నిల్వ చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెస్ట్ డీఎస్పీ గారైన శ్రీ కె. అరవింద్ గారు హెచ్చరించారు.
👉 ఈ కార్యక్రమంలో డిఎస్పీ గారితో పాటు నగరంపాలెం ఎస్సై రాంబాబు గారు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
#🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్


