#Every day my Status #ఉషోదయం # పంచాంగం #నేటి రాశిఫలితాలు
🌹🌹 మిత్రులకు శుభోదయం 💐💐జనవరి 23 శుక్రవారం 💐💐 23/01/26 🌹🌹 పంచాంగం 🌹🌹 రాశిఫలితాలు 🌹💐🌹 ఈరోజు జన్మదినాన్ని/వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు - దీర్ఘాయుష్మాన్ భవ!
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺
🍀
*23, జనవరి, 2026*
*దృగ్గణిత పంచాంగం*
➖➖➖✍️
🌺ఈనాటి పర్వం: *శ్రీ పంచమి / వసంత పంచమి*
*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం*
*శిశిర ఋతౌః / మాఘమాసం / శుక్ల పక్షం*
*తిథి : పంచమి* రా 01.46 వరకు ఉపరి షష్ఠి
*వారం : శుక్రవారం* (భృగువాసరే)
*నక్షత్రం : పూర్వాభాద్ర* మ 02.33 వరకు ఉపరి ఉత్తరాభాద్ర
*సూర్యోదయాస్తమాలు:*
ఉ06.40;సా05.59విజయవాడ
ఉ06.50;సా06.07హైదరాబాద్
*సూర్యరాశి : మకరం చంద్రరాశి : కుంభం/మీనం*
*యోగం : పరిఘ* సా 03.59 వరకు ఉపరి శివ
*కరణం : బవ* మ 02.10 బాలువ రా 01.46 ఉపరి కౌలువ
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 06.30 - 08.30 సా 05.00 - 06.00*
అమృత కాలం : ఉ 06.31 - 08.07
అభిజిత్ కాలం : ప 11.57 - 12.42
*వర్జ్యం : రా 12.02 - 01.37*
*దుర్ముహూర్తం : ఉ 08.55 - 09.41 మ 12.42 - 01.27*
*రాహు కాలం : ఉ 10.54 - 12.19*
గుళికకాళం : ఉ 08.04 - 09.29
యమగండం : మ 03.09 - 04.34
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :ఉ 06.40-08.55
సంగవ కాలం : 08.55 - 11.11
మధ్యాహ్న కాలం : 11.11 - 01.27
అపరాహ్న కాలం : మ 01.27 - 03.43
*ఆబ్ధికం తిధి :మాఘ శుద్ధ పంచమి*
సాయంకాలం :సా 03.43 - 05.59
ప్రదోష కాలం : సా 05.59 - 08.31
రాత్రి కాలం : రా 08.31 - 11.54
నిశీధి కాలం : రా 11.54 - 12.45
బ్రాహ్మీ ముహూర్తం :తె 04.58-05.49.✍️
➖▪️➖
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*23-01-2026-శుక్రవారం*
*రాశి ఫలితాలు:*
➖➖➖✍️
```
మేషం
వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి. ధనవ్యయ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు మరింత పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి.
వృషభం
నూతన వస్తులాభాలు ఉంటాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటారు. ఇంటా బయట ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుంటాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.
మిధునం
విద్యార్థుల అంచనాలు అందుకుంటారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితులు, సహాయ సహకారాలు అందుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. దైవ దర్శనాలు చేసుకుంటారు.వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
కర్కాటకం
వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. గృహమున కొందరి ప్రవర్తన శిరో బాధ కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
సింహం
ఎంత శ్రమపడిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమౌతుంది.
కన్య
నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగమున మీ విలువ మరింత పెరుగుతుంది.
తుల
ఆరోగ్యం మందగిస్తుంది. ధన పరమైన చికాకులు పెరుగుతాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
వృశ్చికం
నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలం అవుతాయి.
ధనస్సు
ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి.
మకరం
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. దైవచింతన పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది.
కుంభం
చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. విలువైన వస్త్ర ఆభరణలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన అనుకూలత కలుగుతుంది. అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.
మీనం
ఆర్థిక ఇబ్బందులు అధికమౌతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ తప్పదు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.✍️```
***************************
. *శుభమస్తు!* ______________________________
*గోమాతను పూజించండి*
*గోమాతను సంరక్షించండి*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.*
🌹🌹 సేకరణ 🌹🌹


