Ps: అడల్ట్ కంటెంట్, సున్నిత మనస్కులు చదవకండి.
సమాజంలో మెజారిటీ మగాళ్లు అవకాశం దొరికితే పరాయి స్త్రీ పక్కలో పడుకోవాలి అనుకునేవారే. ఈమాటను బహిరంగమగా ఎవరూ ఒప్పుకోకాపోయినా ఇది వాస్తవం. దొరికిపోతాం అనే భయమో, అటువంటి అవకాశం దొరకకపోవడమో, ఎయిడ్స్, సిఫిలిస్ లాంటి సుఖవ్యాధులు వస్తాయనే అనుమానం మొదలగు కారణాల వలన బలవంతంగా మల్టిపుల్ సెక్సువల్ రిలేషన్షిప్స్ కి దూరం ఉండేవాళ్ళు ఎందరో...
సమాజంలో అప్పటివరకు మంచివారిగా బతుకుతున్నవారు సడన్ గా నేరాలకు పాల్పడటం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వంటి వాటికి కారణం అప్పటి వరకు వారికి అటువంటి అవకాశాలు దొరకకపోవడం వల్ల బలవంతంగా మంచివారుగా ఉండాల్సిరావడమే కాని స్వతహాగా వారు మంచివారు కాదు.
దొంగతనం చేసినా ఎవరూ పసిగట్టలేరు, పట్టుకోలేరు అని తెలిసినా దొంగతనం చేయనివాడు, ఒక పరాయి స్త్రీ ఒంటరిగా దొరికినా సభ్యతగ నడుచుకునేవాడు,
మోసం చేయడానికి అవకాశం ఉన్నా చేయనివాడు మాత్రమే మంచివాడు, సంస్కారవంతుడు అవుతాడు కాని జీవితంలో అలాంటి అవకాశాలు లభించకపోవడం వలన బలవంతంగా మంచివాడుగా కొనసాగేవాడు కాదు. ఇదెలాంటిది అంటే తినడానికి తిండిలేక ఆకలితో అలమటించడానికి, తినడానికి పంచభక్ష్య పరమాన్నాలు ఉన్నా ఉపవాసం ఉన్నవాడికి ఉన్నంత తేడా ఉంది.
ఇందాక చెప్పినట్టు మగాడు ఇతర స్త్రీలను కోరుకుంటాడు, అవకాశం దొరికితే పరాయి స్త్రీల పక్కలో పడుకుంటాడు కానీ తన భార్యను పరాయి మగాడు ముట్టుకోవడాన్ని కూడా ఊహించుకోలేడు, తట్టుకోలేడు అలాంటిది వీడెవడోగాని డబ్బుల కోసం పెళ్ళాం చేత 1500 మందికి పైగా ట్రాప్ చేయించి, ఆవిడతో 100 మందికి పైగా సెక్స్ లో పాల్గొంటే ఆ దృశ్యాలను కిటికీల్లో, అల్మారా సందులో అమర్చిన కెమెరాల్లో బంధించి, ఆ తర్వాత వాళ్లకు ఆ వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు extortion చేయడం మాములు విషయం కాదు. దండం రా దూత..
సమాజంలో సెక్స్ అంటే అర్రులుచాచే మగాళ్ళు ఉన్నతకాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అందరు వీళ్ళ గురించే మాట్లాడుతున్నారు కానీ వీళ్ళ దగ్గరికి పోయిన ఆ 150 మంది గురించి మాట్లాడటం లేదు.
చివరగా ఒక విషయం చెప్పి ముగిస్తాను. సమాజంలో ఇలాంటివారు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోవద్దు.
వీళ్ళు దొరికారు, దొరకనివాళ్ళు ఎంతమందో... తస్మాత్ జాగ్రత్త.
#😲లేటెస్ట్ వైరల్ వీడియోస్ #అడళ్ళు మీకు జోహార్లు🙏 #👉సమాజం #👉నేరాలు - ఘోరాలు🚨 #💖🦋లవిరాజ్ క్రియేషన్స్🥀💖
00:55

