🪻🪻🪻Ratha Saptami25.1. 2026🪻🪻🪻
🌹🌲🌹Lila Madhu Pasupuleti, Yasodha Durga Boddu, Jaya Lakshmi Gopisetti, vara Lakshmi Sirugudi🌹🌲🌹
మాఘ శుద్ధ సప్తమినే రధ సప్తమి అంటారు. ఈ సంవత్సరం రధ సప్తమి జనవరి 25న వచ్చింది. ఈరోజున పాటించే ప్రతి చర్య వెనుక ఆధ్యాత్మిక, ఆరోగ్య రహస్యాలున్నాయి. పూజ ఇలా చేసుకోండి...
సప్త సప్త మహా సప్త, సప్త ద్వీపా వసుంధరా-సప్తార్క పర్ణ మాధాయ సప్తమి రధ సప్తమి”
అనే శ్లోకాన్ని పఠిస్తూ తల స్నానం చేయండి
రధసప్తమి విశిష్టత ఏమిటి? ఎలా జరుపుకోవాలి?
ప్రాచీన కాలం నుండి మానవుడు సూర్యుని ఆరాదిస్తున్నాడు. సూర్యుడు జ్యోతిషామ్పతి. సూర్య గమనం వలన మనకు దశ- దిశ లు తెలుస్తున్నాయి. ఉదయించే సూర్యునికి ఎదురుగా మనం నుంచున్నప్పుడు; మన కుడి చేతి వైపు దక్షిణం, ఎడమ చేతి వైపు ఉత్తరం, వీపు వెనుక వైపు పడమర దిక్కులు వుంటాయి. సూర్యుని ప్రత్యక్ష నారాయణుడు అంటారు. కశ్యప ప్రజాపతి, అదితి ల కుమారుడే సూర్య భగవానుడు. అదితి కుమారుడు కాబట్టి సూర్యుని ఆదిత్యుడు అని కూడా అన్నారు.
మాఘ మాసం శుక్ల పక్షం లో వచ్చే సప్తమి ని సూర్యుని జయంతి గా చెబుతారు. కశ్యప ప్రజాపతి; సూర్యునకు రధము, సారధి, గుర్రములను ఇచ్చి లోకాదిపత్యం ఈరోజు కలిగించాడు కాబట్టే ఈరోజు రధసప్తమి అంటారు అని పురాణాలు వివరిస్తున్నాయి. సూర్యుని తీక్షణత ఈరోజు నుండి క్రమేణా పెరుగుతుంది.
ఆయుర్వేదం ప్రకారం కఫరోగ, పిత్త, బుద్ధిమాంద్యము లను తొలగించే శక్తి జిల్లేడు ఆకులకు, రేగు పళ్లకు ఉంది అని చెబుతారు కాబట్టి ఈరోజు తలపై జిల్లేడు ఆకు దానిపై రేగు పండుని ఉంచి స్నానం చేయాలని చెబుతారు.
ఆవు పిడకలను దాలిగా చేసి మండించి దానిపై ఇత్తడి పాత్ర ఉంచి ఆవుపాలు, బెల్లం, బియ్యం తో చేసిన పరమాన్నం అంటే సూర్యునికి ఎంతో ప్రీతి; పంటలు చేతికొచ్చే కాలం లో వచ్చిన సప్తమి కాబట్టి ఈరోజు వండే పరమాన్నం లో కొత్త బియ్యం వాడుతారు.
ఈరోజు స్వామి వారిని ఎర్రటి పుష్పములతో (ఎర్ర మందారం వంటివి ) పూజించాలి. సూర్య నమస్కారములు చేయాలి. అగస్త్యుడు శ్రీరామునికి ఉపదేశించిన ఆదిత్య హృదయం ప్రతి రోజు పారాయణ చేసేవారు ఈ రోజు 12 సార్లు పారాయణం చేయాలి.
ఏ విధం గా సూర్యుడు లోకానికి ఉపయోగపడి లోక బాంధవుడు అయ్యాడో అదే విధం గా లోకానికి ఉపయోగపడే మంచి పుత్రుని ఇమ్మనమని రధసప్తమి రోజు వ్రతం ఆచరిస్తారు.
రధసప్తమి రోజు ఛత్రము, పాదుకలు, ఎరుపు వస్త్రము, ఆవుపాలు, ఆవు నెయ్యి దానము చేసిన మంచిది.
సేకరణ. #🙏நமது கலாச்சாரம் #🙏ஏகாதசி🕉️ #🔯இந்த ராசிகளுக்கு அதிர்ஷ்டம்🌠 #🇮🇳#INDvsNZ on Jio Cinema🏏


