ShareChat
click to see wallet page
search
#ఓం నమశ్శివాయ 🙏 హరే కృష్ణ 🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏శ్రీ గోమాతాయై నమః🙏 #🔱🕉️ హర హర మహాదేవ శంభో శంకర 🔱 #ముక్కోటి దేవతలు గోమాత తల్లికి, పార్వతీ పరమేశ్వరులు కి, శరణం శరణం శరణం #ఓం నమః శివాయ# హర హర మహాదేవ శంభో శంకర#శ శివ శివ శంకర# హర హర శంకర# భక్తి పాట# భక్తి స్టేటస్# 🕉️🕉️🕉️ #🙏శివపార్వతులు *ఆర్ద్రోత్సవం_శివముక్కోటి.* "చిదంబర క్షేత్రం" *వ్యాఘ్రపాదుడు - పతంజలి* నటరాజ దర్శనం. చిదంబర క్షేత్ర పురాణం ప్రకారం, ఈ ఇద్దరు మహనీయుల తపస్సు ఫలమే నేటి చిదంబర క్షేత్రం. *వ్యాఘ్రపాదుడు* (పులి కాళ్ళు కలిగిన ముని) మధ్యాందిన ముని కుమారుడే వ్యాఘ్రపాదుడు. ఆయనకు శివుడంటే అమితమైన భక్తి. శివుడిని పూజించడానికి చెట్లపై ఉన్న పూలను కోసేవాడు. అయితే, తుమ్మెదలు వాలిన పూలను శివునికి అర్పించకూడదని ఆయన నియమం. స్వచ్ఛమైన పూల కోసం సూర్యోదయానికి ముందే, చీకట్లో ఎత్తైన చెట్లెక్కి పూలు కోయాలి. మంచులో జారి పడకుండా ఉండటానికి, చీకట్లో కూడా కనిపించడానికి అనుగ్రహించమని శివుడిని కోరాడు. ఆయన భక్తికి మెచ్చిన పరమశివుడు, ఆయనకు "పులి కాళ్లను, పులి కళ్లను" (వ్యాఘ్ర పాదములు, నేత్రములు) ప్రసాదించారు. అందుకే ఆయనకు వ్యాఘ్రపాదుడు అని పేరు వచ్చింది. ఆయన తిరుమూలనాథుని (శివలింగాన్ని) అర్చిస్తూ చిదంబరంలోని "తిల్లై" (మడ) అడవుల్లో ఉండేవారు. *పతంజలి* (ఆదిశేషావతారం) ఒకసారి విష్ణుమూర్తి పాలకడలిపై ఆదిశేషుని పాన్పుగా చేసుకుని నిద్రిస్తూ, ఒక్కసారిగా బరువు పెరిగిపోయాడు. ఆ బరువును ఆదిశేషుడు తట్టుకోలేకపోయాడు. విష్ణువును కారణం అడగగా, "శివుని ఆనంద తాండవాన్ని మానసికంగా దర్శించడం వల్ల కలిగిన ఆనందంతో నా శరీరం ఇలా స్పందించింది" అని విష్ణువు చెప్పాడు. ఆ మాట విన్న ఆదిశేషుడికి కూడా ఆ శివ తాండవాన్ని చూడాలని కోరిక కలిగింది. విష్ణువు అనుమతితో, ఆదిశేషుడు భూమిపై "గోణిక" అనే యోగిని దోసిలిలో (అంజలిలో) చిన్న పాము పిల్లగా పడ్డాడు. "పతత్" (పడిన) + "అంజలి" (దోసిలి) కనుక పతంజలి అయ్యాడు. ఆయన కూడా చిదంబరం చేరుకుని వ్యాఘ్రపాదుని కలిశాడు. *ఆనంద తాండవ దర్శనం* వ్యాఘ్రపాదుడు, పతంజలి ఇద్దరూ చిదంబరంలోని తిల్లై వనంలో ఘోర తపస్సు చేశారు. వారి భక్తికి మెచ్చి ధనుర్మాసంలో, ఆర్ద్రా నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు పరమశివుడు కోటి సూర్య ప్రభలతో దిగివచ్చారు. దేవతలు పూల వాన కురిపిస్తుండగా, సకల లోకాలు నిశ్శబ్దమై చూస్తుండగా, పరమశివుడు వారి ముందు "ఆనంద తాండవం" చేశారు. ఆ దివ్య దృశ్యాన్ని చూసి ఆ ఇద్దరు మునులు తన్మయత్వంతో కన్నీరు మున్నీరుగా ఆనందించారు. లోక కళ్యాణం కోసం శివుని అక్కడే ఆనంద తాండవ భంగిమలో స్థిరపడమని వేడుకున్నారు. అందుకే చిదంబరంలో నటరాజు నిత్యం నాట్యం చేస్తూ ఉంటారు. అట్టి నటరాజస్వామివారు ఆర్ద్రోత్సవం రోజున సూర్యోదయాత్పూర్వం విశ్వరూపమైన ఆకాశములో ఆర్ద్రా నక్షత్ర రూపములో దర్శనమిస్తారు. కళ్యాణమూర్తిం కనకాద్రిచాపం కాంతాకృపం కరుణానిధానమ్. కపర్దినం కామరిపుం కరేశం చిదంబరేశం హృది భావయామి. శుభప్రదమైన రూపం కలవాడు, మేరు పర్వతాన్ని (కనకాద్రి) ధనస్సుగా చేసినవాడు, స్త్రీల పట్ల (భక్తుల పట్ల) దయగలవాడు, కరుణకు నిధి వంటివాడు, జఠలను ముడిగా వేసుకున్నవాడు, మన్మధుని జయించినవాడు అయిన ఆ చిదంబరేశ్వరుని నా హృదయంలో ధ్యానిస్తున్నాను. శ్లోకం :- అనంతం హృదంతం గుహాంతం వసంతం ముకుందం త్రివక్రం స్వరూపం హసంతం. సదానందభావం విదూరం వికారం చిదంబర నటం హృది భజ. భావము :- అంతము లేనివాడు, అందరి హృదయ గుహలో నివసించేవాడు, ముక్తిని ప్రసాదించేవాడు, మూడు వంపులు తిరిగిన సుందర రూపం కలవాడు (త్రిభంగి), చిరునవ్వు చిందించే ముఖం కలవాడు. ఎల్లప్పుడూ ఆనంద స్వరూపుడు, వికారాలకు (దోషాలకు) దూరంగా ఉండే ఆ చిదంబర నటరాజును హృదయంలో భజించుచున్నాను. 🙏 Courtesy: L.S.Sidhanti
ఓం నమశ్శివాయ 🙏 హరే కృష్ణ 🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏శ్రీ గోమాతాయై నమః🙏 - %४ ೧೨೦ GHIDAM BARAM S.S.A.VENIATESA CHETN %४ ೧೨೦ GHIDAM BARAM S.S.A.VENIATESA CHETN - ShareChat