#సంక్రాంత శుభాకాంక్షలు #✨సంక్రాంతి స్టేటస్🌾
#🌞సంక్రాంతి శుభాకాంక్షలు🪁
#🌾మా ఊరి సంక్రాంతి సంబరాలు🏡
--------------------------------------- *మకర సంక్రాంతి*
---------------------------------------
*ఉత్తరాయణ పుణ్యకాలం విశిష్టత*
*‘సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే ‘చేరడం’ లేదా ‘మారడం’అని అర్థం.సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి...*
*జయసింహ కల్పద్రుమం అనే గ్రంథం ‘సంక్రాంతి’ని ఇలా నిర్వచించింది,..*
---------------------------------------
*‘‘తత్ర మేషాదిషు ద్వాదశ*
*రాశి క్రమణేషు సంచరితః*
*సూర్యస్య పూర్వన్మాద్రాశే*
*ఉత్తర రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః’’*
--------------------------------------
*మకర సంక్రమణానికెంతో ప్రాముఖ్యత ఉందని పురాణేతిహాసాల్లో కానవస్తోంది.*
----------------------------------------
*‘‘రవి సంక్రమణే ప్రాపే న*
*న్నా యాద్యన్తు మానవః*
*సప్త జన్మసు రోగీ స్యా*
*నిర్దేనశే్చన జాయతే’’*
-------------------------------------
*అని స్కాంద పురాణం చెబుతోంది, అంటే, రవి మకర రాశిలో ప్రవేశించినపుడు ఎవడైతే స్నానం చేయడో అలాటి వాడు ఏడు జన్మలు రోగిగా, దరిద్రునిగా ఉండిపోతాడని భావం.*
----------------------------------------
*పురాణాల ప్రకారం సూర్య భగవానుడు ఈ రోజునేతన కుమారుడైన శని ఇంటికి వెళతాడు. ఆయనం అనగా పయనించడం అని అర్థం, ఉత్తర ఆయనం అంటే ఉత్తరవైపు పయనించడం అని అర్థం.*
*సూర్యుడు భూమికి కొంత కాలం దక్షిణం వైపు* *పయనించాక దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపు పయనించనారంభిస్తాడు,*
*సూర్యుడు పయనించే దిక్కునుబట్టి, దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు* *దక్షిణాయనం అనీ, ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు.*
----------------------------------------
*ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయణం పాప కాలం అని అర్ధం చేసుకోకూడదు.*
*దక్షిణాయణం కూడా పుణ్య కాలమే.. అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు…*
----------------------------------------
*ఉత్తరాయణంలో లయ కారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు.. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరం గా వుండడం వలన పుణ్య క్షేత్రాలు, తీర్ధ యాత్రలకు అనువుగా వుంటుంది.... మనం ఉత్తర దిక్కునూ, ఉత్తర భూములనూ పవిత్రం గా భావించడం వల్లనూ వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వల్లనూ, హైందవ సంస్కృతి, జ్ఞాన విజ్ఞానం, భాష, నాగరికత ఉత్తరాది వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వల్లనూ, సమస్త భాషలకూ తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వల్లనూ, సమస్త ఋషులకూ, దేవతలకూ, పండితులకూ ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావటం వల్లనూ, ముఖ్యంగా ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఉత్తర పధ చలనం చేయడం వల్లనూ, ఉత్తరాయణ కాలం ను పుణ్య కాలంగా మనం భావిస్తాము.*
----------------------------------------
*సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి.*
*సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒక వైపు అనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒకవైపు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు.భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను, ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలు గాను అభివర్ణించారు.మానవులు రాత్రులు నిద్రపోయి పగలు, ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయనం నందు మేలుకొని ఉంటారని, వారు మేలుకొని ఉండగా అడిగిన కోర్కెలు వెంటనేతీరుస్తారని, ఆవిషయం అందరికీ తెలియజేయడం కోసం పెద్దలు ఈ పండుగలను జరపడం మొదలుపెట్టారు.*
----------------------------------------
*ఈ రోజునుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణం. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి, ఐతే పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా, ఈ మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు.*
----------------------------------------
*ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏదానమైనా శ్రేష్టమైందని ఆర్యోక్తి, ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం,* *కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనవి ఉత్తమమైనవి.*
*ఈ కాలంలో గోవును దానం చేస్తే స్వర్గ వాసం కలుగుతుందని ఆస్తిక లోక విశ్వాసo.* ---------------------------------------🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻--------------------------------------- *పుణ్యకాలం ప్రారంభం*
----------------------------------------
*సంక్రాంతి అంటే మారడం, చేరడం అని అర్థం. 'త మేషాదిషు ద్వాదశ రాశిషు క్రమేణ సంచరతః సూర్యస్య పూర్వ స్మాద్రాశే ఉత్తరరాశా సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః' సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు సంచరిస్తూ క్రమంగా పూర్వరాశి నుండి ఉత్తరాభిముఖంగా ప్రవేశించినప్పుడు సంక్రాంతి అవుతుంది.*
----------------------------------------
*కర్కాటకం నుండి మకర సంక్రాంతి వరకు సూర్యుడు దక్షిణాభిముఖంగా సంచరించడం వల్ల ఈ కాలాన్ని 'దక్షిణా యనమ'ని అంటారు. మకర సంక్రాంతి నుండి కర్కాటక సంక్రాంతి వరకు సూర్యుడు ఉత్తరాభిముఖుడై సంచరించడం వల్ల ఈ కాలాన్ని 'ఉత్తరాయణమ'ని అంటారు.*
---------------------------------------
*దేవతలకు ఉత్తరాయణం ఉత్తమకాలమనీ, దక్షిణాయనం పితృదేవతలకు ముఖ్యకాలమనీ భావిస్తారు. ఉత్తరాయణంలో మరణిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని అంటారు. అందుకే అంపశయ్యపై భీష్మాచార్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు వేచి ఉన్నాడని మహాభారతం చెబుతోంది.*
--------------------------------------
*1)సంక్రమణం నాడు ఇంటి ముంగిట అలికి, రంగు రంగుల పిండితో ముగ్గులు పెట్టి, గోమయంతో గొబ్బిళ్ళు చేసి, వాటిలో రంగు రంగుల పూలనూ, నూలు బియ్యాన్నీ, రేగుపండ్లను పెట్టి ఇళ్ళను అలంకరించుకుంటారు.*
---------------------------------------
*2)సంక్రాంతి పండుగనాడు నానావిధాలైన కూర అన్నింటిని కలిపి వండుతారు. ఆ రోజు బ్రాహ్మణులకు కూర గాయలనూ, ధాన్యాన్నీ, దక్షిణనూ ఇస్తారు.*
----------------------------------------
*3)నిత్యకృత్యాలు పూర్తి చేసుకుని, సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేసి, పుష్పాలు సమర్పించి, అంజలి ఘటించి, గాయత్రీ మంత్రం జపిస్తూ, సద్బుద్ధి, జ్ఞానం, ఉత్సాహభరితమైన, ఆరోగ్యవంతమైన జీవితం ప్రసాదించాల్సిందిగా ప్రార్థించాలి.*
----------------------------------------
*4)పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. పూర్వజుల మొక్కు బడులూ, ఆశయాలూ, ఆశలూ, ప్రతిజ్ఞలూ తీర్చాలి.*
----------------------------------------
*5)నువ్వుపప్పు, బెల్లం కలిపి, 'లడ్డూ'లు తయారు చేసి, బంధుమిత్రులకు పంచిపెట్టాలి. అలా చేయడం వల్ల సంకుచిత మైన భావాలు పోయి, అందరితో సత్సంబంధాలు ఏర్పడతాయి.*
---------------------------------------
*6)సంక్రాంతి శీతకాలంలో వస్తుంది. కాబట్టి ఈనాడు ఉష్ణాన్నిచ్చే నువ్వులు, నెయ్యి, కంబళ్ళు పేదలకు దానం చేయడం పుణ్యదాయకం.*
---------------------------------------- 🐄🐄🐄🐄🐄🐄🐄🐄 ---------------------------------------- *సంక్రాంతి వెనుక ఎవరికీ తెలియని అయిదు కథలు*
--------------------------------------
*సంక్రాంతి అనగానే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకుమించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. అవేంటో మీరే చూడండి...*
----------------------------------------
*పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు, ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి, ఆయన తపస్సుని భంగం చేశారు, దాంతో కపిలముని వాళ్లందరినీ బూడిదగామార్చేశాడు, ఆబూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ, వారి ఆత్మశాంతించదని తెలుస్తుంది, ఆకాశంలో ఉండే గంగని ఎవరూ నేల మీదకి తేలేకపోయారు, సగరుడి వంశంలో పుట్టిన భగీరధుడు ఈ పని చేయగలిగాడు, ఆయన తపస్సుకి మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందట!*
----------------------------------------
*సంక్రాంతి గంగిరెద్దుల వెనుక కూడా ఓ కథ ఉంది, పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలా ఆగజాసురుడు వరాన్ని కోరుకున్నాడు,*
*శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓఉపాయం ఆలోచించాడు, దేవతలంతా తలా ఓవాయిద్యాన్నీ పట్టుకుని, నందికితో కలిసి గజాసురుడి దగ్గరకు బయల్దేరారు, వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకొమ్మని అడిగాడు. ఇంకేముంది! తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగేశారు, అలా ఆనాడు శివుని పొందేందుకు చేసిన హడావుడే, ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెబుతారు.*
----------------------------------------
*కనుమ రోజు పశువులని పూజించడం వెనుక కూడా, ఓ కథ వినిపిస్తుంది. ఒకసారి శివుడు నందిని పిలిచి* *‘భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి’ అని చెప్పి రమ్మన్నాడు* *కానీ నంది అయోమయంలో, ‘రోజూ ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి’ అని చెప్పిందట. దాంతో కోపం వచ్చిన శివుడు. ‘ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి, ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి’ అని శపించాడు,*
*అప్పటి నుంచి ఎద్దులు, వ్వవసాయంలో సాయపడుతున్నాయట, కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు.*
----------------------------------------
*సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం కదా! దీనికి కూడా ఓకథ చెబుతారు, సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట, ఇది దేవతలకు పగలు అని నమ్మకం, దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట, దేవతలకి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు.*
----------------------------------------
*సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే, హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర, ఈ భూమికి చిహ్నమని చెబుతారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తయ్యి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు. ఇవండీ సంక్రాంతి గురించి ఓ అయిదు కథలు. ఇంకా గొబ్బెమ్మలు దగ్గర నుంచి భోగిపళ్ల వరకు... సంక్రాంతిలో కనిపించే ప్రతి ఆచారానికీ ఓ కథ ఉంది.* ---------------------------------------


![Gudapati Naresh [ Amma Chetti Goru mudda ] - Author on ShareChat: Funny, Romantic, Videos, Shayari, Quotes](https://cdn-im.sharechat.com/7ac3774_1686806431959_sc.jpeg?referrer%3Dpost-rendering-service-ues%26tenant%3Dsc=&tenant=sc&referrer=pwa-sharechat-service&f=59_sc.jpeg)