ShareChat
click to see wallet page
search
#✌️నేటి నా స్టేటస్ కదా నాకు కూడా తప్పలేదు. సమస్య ఎదురైనప్పుడు నాకు తెలిసినవన్నీ పక్కన పెట్టీ ఉద్రేకంతోనే స్పందించాను. అర్థం అయ్యింది , అర్థం చేసుకున్నా, మనల్ని మనం శుద్ధిగా ఉంచుకోవడమే ఉంది . ఎదుటి వాళ్ళు ఎలా ఉండాలో నిర్ణయించే హక్కు , అధికారం , ఉద్దేశం, ఆలోచన మనకు లేదు. మనుషులందరూ సరిగ్గా ఉండాలని అనుకోవడంలోనే అహంకారం ఉంది. నేను ఎలా ఉన్నాను అనేది పక్కన పెట్టీ అందరూ సరిగ్గా ఉండాలి అనే అనుకున్న . కొంత అంతరంగ మథనం జరిగాక కానీ బోద పడలేదు మనస్సు చేసే మాయ. కేవలం నన్ను నేను బాగు చేసుకోవడమే ఉంది. ఎవరిని మనం మార్చలేము. కానీ మనకు తెలిసింది మార్పు కోరుకునే వారికి ఉపయోగ పడితే చెప్పొచ్చు. మారాలని వారికి అనిపిస్తే మన అనుభవం వారికి సహకారం అవ్వొచ్చు. కానీ ఎవరూ మారరు, మార్చలేము. వారు అనుకుంటే తప్ప . నేను ఒక గొప్ప పాఠం ఎరుక తో నేర్చుకున్న . నన్ను నేను మార్చుకుంటున్న . పత్రిజీ డాక్యుమెంటరీ మొదలు పెట్టినప్పటి నుండి ఎన్నో నేర్చుకున్నా, ఎంతో మార్చుకున్న . ఇంకా నేర్చుకుంటా, మార్చుకుంటా. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్స్ గొప్పతనాన్ని నేను గమనించాను. నేను ఉద్రేకంతో పెట్టిన పోస్ట్ లకు పెద్దగా స్పందన రాలేదు. కానీ ఒక మంచి విషయాన్ని చెప్పినప్పుడు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చర్య ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. పిరమిడ్ మాస్టర్స్ అయిన మేము మంచిని మాత్రమే గ్రహిస్తాం. కొంత వ్యతిరేక స్వరం వినపడినా నిశ్శబ్దంగా చూస్తాం కానీ స్పందించం. మాకు పత్రిజీ అందించిన జ్ఞానం ఎవరిని జడ్జ్ చేయకు అని మేము దాని మీదే నిలబడి ఉన్నాం. అని చేసి చూపించారు. అందుకేనేమో పత్రిజీ పిరమిడ్ మాస్టర్స్ ను నెత్తిన పెట్టుకున్నారు. ఎప్పుడూ పిరమిడ్ మాస్టర్స్ ను తక్కువ చేసి మాట్లాడలేదు. Yes నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. పిరమిడ్ మాస్టర్స్ చాలా గ్రేట్. ఇక నుంచి కేవలం మంచిని మాత్రమే పంచుదాం, సరైనదాన్నీ మాత్రమే పెంచుదాం. నాకు సహకరించిన ప్రతి మాస్టర్ కు కృతజ్ఞతలు, నా మంచి కోరి నాకు సూచనలు ఇచ్చిన ప్రతి మాస్టర్ కి నా ధన్యవాదాలు. 🙏🙏🙏 ధ్యాన వెంకట్
✌️నేటి నా స్టేటస్ - మాటన్నది  జ్యోతిర్లింగం 60 దొంగలించకు చంపకు అబద్ధం పలుకకు కోపగించుకోకు అన్యులను ఏవగించుకోకు నీ గురించి పొగుడుకోకు ఎదుటి వ్యక్తిని నిందించకు ఇదే అంతరంగ శుద్ధి బహిరంగ శుద్ధి ఇదే ఇదే మా కూడలసంగమదేవుని పద్ధతి మెప్పించే మాటన్నది  జ్యోతిర్లింగం 60 దొంగలించకు చంపకు అబద్ధం పలుకకు కోపగించుకోకు అన్యులను ఏవగించుకోకు నీ గురించి పొగుడుకోకు ఎదుటి వ్యక్తిని నిందించకు ఇదే అంతరంగ శుద్ధి బహిరంగ శుద్ధి ఇదే ఇదే మా కూడలసంగమదేవుని పద్ధతి మెప్పించే - ShareChat