ShareChat
click to see wallet page
search
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: శ్రీ మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతం "మధ్వానవమి" 🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ద్వైత మత బోధకులు మధ్వాచార్యులు 🙏 *ద్వైత మత బోధకులు మధ్వాచార్యులు* *జనవరి 27 మంగళవారం మాఘ శుద్ధ నవమి మధ్వాచార్య నిర్యాణం సందర్భంగా...* భారత దేశ నాగరికతకు మతము జీవ కర్ర వంటిది. మతత్రయాచార్యులలో, వైష్ణవ మత బోధకులలో అగ్రగణ్యులైన శ్రీమధ్వాచా ర్యులు ఒకరు. త్రిమతాచార్యులలో మూడవ వారై, హనుమంతుడు, భీముడు, అనంతరం వాయుదేవునకు తృతీయ అవతారంగా భావించే మధ్వాచార్యులు ద్వైత మత బోధ కులు. ఆయన సాంప్రదాయాలను పాటించే వారిని మాధ్యులు లేదా మధ్యమతస్తులు అంటారు. క్రీ.శ.1238 విళంబి నామ సంవ త్సర ఆశ్వయుజ మాస శుక్ల పక్ష దశమి (విజ యదశమి) నాడు ఆయన కొంకణ కేరళ మధ్యనున్న కనరా మండలంలోని ఉడిపి పట్టణ సమీపస్థ పాజక క్షేత్రంలో మధ్య గేహ భట్టు, వేదవతి దంపతులకు జన్మించారు. ఉడిపిలోని అనంతేశ్వర స్వామిని చిరకాలం కొలిచిన ఫలితంగా వాయు అంశమున జన్మించినందున ఆయనకు వాసుదేవుడని తల్లిదండ్రులు పేరు పెట్టారు. అనంతర కాలంలో "పూర్ణప్రజ్ఞ, ఆనందతీర్థ, మధ్యా చార్య" అనే నామాలతో ప్రసిద్ధులైనారు. 8వ ఏట ఉపనయన సంస్కారియై, 10ఏళ్లకే సర్వ విద్యా పాఠగుడైనారు. 11ఏళ్ల వయసులో సన్యాసంవైపు ఆకర్షితులై, అచ్యుత ప్రజ్ఞ అనే యతివర్యులైన ఆధ్యాత్మిక గురువు వద్ద సన్యాసాశ్రమాన్ని స్వీకరించి, "పూర్ణబోధ" పేరునంది అనే గొప్ప పండితుని ఓడించి "మధ్వ, పూర్ణప్రజ్ఞుడు" బిరుదులు పొందారు. వేదాంత విద్యా రాజ్య పట్టాన్ని పొంది "ఆనంద తీర్థులు" నామాంచితులై నారు. యుక్త వయసులోనే దక్షిణ భారతావ నిలో కన్యాకుమారి, రామేశ్వరం, శ్రీరంగం తదితర క్షేత్రాలను సందర్శించారు. తాను పొందిన తత్వజ్ఞానాన్ని ఉపన్యాస రూపంలో ప్రజలకు వివరించారు. మూఢ నమ్మకాలను, ఆధ్యాత్మికతతో ముడిపెట్టడాన్ని వ్యతిరేకించారు. శ్రీశంకర భగవత్పాదుల ప్రస్థాన త్రయానికి ఒనర్చిన భాష్యాలను మధ్వాచార్య విమర్శించారు. దక్షిణ దిగ్విజయ యాత్ర గావిస్తూ, తన ముఖ్య శిష్యుడైన సత్యతీర్థు లతో కలిసి బదరి యాత్ర చేశారు. ఆ సంద ర్భంలోనే బ్రహ్మసూత్రాలపై భాష్యాలను పూర్తి చేశారు. స్వదేశానికి తిరిగి వస్తూ రాజ మహేంద్రవరంలో శ్యామశాస్త్రి (నరహరి తీర్థులు)ని మాయావాదం గురించి ఓడించి, ప్రచండవాదం గావించి, శిష్యుడిని చేసుకు ఉన్నారు. అలాగే అక్కడే శోభనభట్టు (పద్మనాభతీర్థులు) అనే పండితుడు శిష్యుడైనాడు. ఉడి పిలో భగవద్గీత, ఉపనిషత్తులకు భాష్యాలు రాసారు. రుగ్వేదంలోని 40సూక్తాలకు, భారత భాగవతాలకు వ్యాఖ్యానాలు రచిం చారు. శ్రీకృష్ణామృత మహార్ణవం, కర్మని ర్ణయం, గీతాభాష్యం, బ్రహ్మసూత్ర భాష్యం, ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు, మహా భారత తాత్పర్యంలాంటి అనేక గ్రంథ రచనలు గావించారు. తర్కంతో పాటు 37 గ్రంథాలను విరచించారు. మధ్వాచార్య ఆసేతు హిమా చల పర్యంతం పర్యటించి, ద్వైత మత విస్తృత ప్రచారం గావించి, వైష్ణవ మత వ్యాప్తికి, ప్రధానంగా కృష్ణభక్తి వ్యాప్తికి మధ్వ మతం ద్వారా ఇతోధికంగా కృషి సల్పారు. భీమసేనుని అవతారమని భావించే ఆయన వృకోదరత్వాన్ని పలుమార్లు ప్రదర్శించి, విష్ణు మంగళ గ్రామాన 200ఆరటి పళ్ళను ఆరగింప ప్రార్థితుడై అలవోకగా తిని వేశారు. ఇషుపాతమనే మరో గ్రామంలో 1000అరటి పళ్ళు తెచ్చి ఇవ్వగా, అన్నింటినీ ఒకే ఊపులో ఆరగించారు. అడవి మార్గన సంచరిస్తుం డగా, పొదలనుండి వచ్చి, శిష్యుని మీద దూకిన పులిని ఒకే గుద్దుతో హతమార్చారు. కడూరా మండలంలోని ముద్గర గ్రామ సమీప తుగభద్రా నదీ తీరాన అంబుతీర్థమనే ప్రదేశాన ఒడ్డునుండి నదిలోనికి అడ్డంగా పడి ఉన్న పెద్ద బండరాయిని చూసి, విషయం కనుగొని, అవలీలగా ఒక్క చేతితో ఎత్తి అనుకున్న స్థలంలో అనువుపరిచారు. ఆయన అతిలోక బల సామర్థ్యానికి నిదర్శ నంగా, ఆ బండ మీద (శ్రీ మదా మద్వాచార్యైరేక హస్తేన ఆనీయ స్థాపిత శిలా" అనే అక్షరాలు రాలు చెక్కబడినవై ఉన్నాయి. తమ 79వ ఏట క్రీ.శ.1317లో పింగళి నామ సంవత్సర మాఘ శుక్ల నవమి నాడు శిష్య సమేతులై బదరీ నారాయణుని దర్శించి, ఉత్తర బదిరిని ఒంట రిగా చేరి, వ్యాస భగవానుని కైంకర్యాలలో నిమగ్నమై, దేహం చాలించారు. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: శ్రీ మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతం "మధ్వానవమి" 🙏 - రస్ానిసరనిందిం @Qdwat దెగెగు ಕಭಾಾಗತಣು O Daily Wish Telugu 0+91 9700 722 711 19 రస్ానిసరనిందిం @Qdwat దెగెగు ಕಭಾಾಗತಣು O Daily Wish Telugu 0+91 9700 722 711 19 - ShareChat