ShareChat
click to see wallet page
search
#మన ఆధ్యాత్మికత #ఆధ్యాత్మిక అమృతవాహిని #ప్రాణంలేని భుజం వ్రాయగలిగితే, ఈ తెగిన తల కూడా నవ్వగలదేమో!* సులోచన – ఓ పతివ్రత మహిమ కథ” భర్తను దేవుడిగా భావించి, శీలం, భక్తి, నైతిక విలువలు సతిత్వo తో ధర్మంగా జీవించిన ఒక స్త్రీ మూర్తి కథ . భారతీయ ఇతిహాస సంప్రదాయంలో రామాయణం ఒక పవిత్రమైన ధార్మిక గ్రంథం మాత్రమే కాదు, మానవ జీవితానికి మార్గదర్శకమైన మహా ధర్మకథ కూడా. ఈ కథ వాల్మీకి రామాయణం శ్రీ రామచరిత మానస్ వంటి మూలగ్రంథాలలో ప్రత్యక్షంగా లేదు. ఆ రామాయణ పరంపరలో ప్రధాన ఘట్టాలకే పరిమితం కాకుండా ప్రజల మేధస్సు, భక్తి, ధార్మిక భావనలతో వికసించిన అనేక ఉపాఖ్యానాలు, లోకకథలు కూడా చోటు చేసుకున్నాయి. సతీ సులోచన కథ కూడా ఉత్తర భారతంలో బాగా ప్రాచుర్యం లో ఉన్న ఒక ప్రసిద్ధ లోక కథ. ఇక కథలోకి వెళితే సులోచన వాసుకి నాగుని కుమార్తె, లంకాధిపతి రావణుని కుమారుడైన మేఘనాదుడు (ఇంద్రజిత్) భార్య. లక్ష్మణునితో జరిగిన ఘోర యుద్ధంలో మేఘనాదుడు వీరమరణం పొందాడు. అతని తెగిన శిరస్సును భగవాన్ శ్రీరాముని శిబిరానికి తీసుకువచ్చారు. భర్త మరణవార్త తెలిసిన వెంటనే సులోచన తన మామగారు రావణుని వద్దకు వెళ్లి, రాముని దగ్గరకు వెళ్లి తన భర్త శిరస్సును తెచ్చేందుకు అనుమతి ఇవ్వమని ప్రార్థించింది. కానీ రావణుడు అందుకు అంగీకరించక అతడు సులోచనతో ఇలా అన్నాడు ఓ సులోచనా నీవే స్వయంగా రాముని దగ్గరకు వెళ్లి మేఘనాదుని శిరస్సును తీసుకురావలసింది అని శ్రీ రాముడు పురుషోత్తముడని ఆయన దగ్గరకు వెళ్లడంలో నీకు ఎలాంటి భయమూ అవసరం లేదు.” అని చెబుతాడు. రావణుని యొక్క కుమారుడు మహావీరుడైన ఇంద్రజిత్ (మేఘనాదుడు)ను సంహరించాలనే ప్రతిజ్ఞతో లక్ష్మణుడు యుద్ధానికి సిద్ధమయ్యే సమయంలో శ్రీరాముడు ఆయనతో ఇలా అన్నాడు ఓ లక్ష్మణా! యుద్ధరంగంలో నీ వీరత్వంతో, నీ యుద్ధనైపుణ్యంతో నీవు మేఘనాదుని వధిస్తావన్న విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. కానీ ఒక విషయం మాత్రం నీవు ప్రత్యేకంగా జాగ్రత్తగా వహించాలి .మేఘనాదుని శిరస్సు ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై పడకూడదు. ఎందుకంటే మేఘనాదుడు నారీ వ్రతాన్ని పాటించే వాడు, అతని భార్య పరమ పతివ్రత. అటువంటి సాధ్వి భర్త శిరస్సు భూమిపై పడితే మన సైన్యం మొత్తం నాశనం అవుతుంది; యుద్ధ విజయం మీద ఆశ కూడా వదులుకోవలసి వస్తుంది.” లక్ష్మణుడు తన సైన్యంతో యుద్ధరంగానికి బయలుదేరాడు.ఆదిత్యయోగీ. సమరభూమిలో శ్రీరాముడు చెప్పినట్లే చేశాడు. తన బాణాలతో మేఘనాదుని శిరస్సును తెగదెంపులు చేశాడు కానీ భూమిపై పడనివ్వలేదు. ఆ శిరస్సును హనుమంతుడు రఘునందనుడైన శ్రీరాముని వద్దకు తీసుకువచ్చాడు. యుద్ధ సమయంలో మేఘనాదుని కుడి భుజం ఆకాశంలో ఎగిరి వెళ్లి అతని భార్య సులోచన దగ్గర పడింది. సులోచన ఆశ్చర్యపోయింది. క్షణంలోనే తీవ్రమైన దుఃఖంతో విలపించసాగింది. కానీ ఆ భుజాన్ని ఆమె స్పర్శించలేదు. “ఇది ఎవరో ఇతరుడి భుజం అయి ఉండవచ్చు. అలా అయితే పరపురుషుని స్పర్శ దోషం నాకు అంటుకుంటుంది” అని ఆలోచించింది. నిర్ణయం కోసం ఆమె ఆ భుజంతో ఇలా చెప్పింది “నీవు (ఇది) నా స్వామి భుజమే అయితే, నా పతివ్రత శక్తితో యుద్ధం జరిగిన మొత్తం విషయాన్ని వ్రాసి చూపించు.” ఒక దాసి ఆ భుజానికి కలం ఇచ్చింది. ఆ భుజం ఇలా వ్రాసింది “నా ప్రాణప్రియమైన సులోచనా! ఈ భుజం నాదే. యుద్ధభూమిలో శ్రీరాముని సోదరుడైన లక్ష్మణునితో నాకు యుద్ధం జరిగింది. లక్ష్మణుడు అనేక సంవత్సరాలుగా భార్యను,అన్నాన్ని, నిద్రను త్యజించి తపస్సు చేసినవాడు. ఆయన తేజస్సుతో, సమస్త దైవీ గుణాలతో పరిపూర్ణుడైన వాడు. యుద్ధంలో ఆయన ముందు నేను నిలువలేకపోయాను. చివరికి ఆయన బాణాల చేత గాయపడి నా ప్రాణాలు విడిచాను. నా శిరస్సు శ్రీరాముని వద్ద ఉంది.”భర్త భుజం వ్రాసిన మాటలు చదివిన వెంటనే సులోచన వ్యాకులమైంది. సులోచన కన్నీళ్ల పర్యంతం అయింది . కోడలు విలపిస్తున్న శబ్దం విని లంకాధిపతి రావణుడు అక్కడికి వచ్చి ఇలా అన్నాడు ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాడు. అప్పుడు సులోచన మామ గారి తో నీవు రేపు యుద్ధ భూమిలో వేలు, కోట్లు తలలను సంహరించినా నా స్వామి శిరస్సు లేని లోటును పూడ్చలేవు అని సతీసహగమనము చేసి భర్తను అనుసరించాలి అని నిర్ణయించుకొని మామ గారైన రావణుని దగ్గర సెలవు తీసుకొని అతని అనుమతి తో శ్రీరామ సేన ఉన్న శిబిరానికి వెళ్ళింది సులోచన. సులోచన రాబోతున్న వార్త తెలిసిన వెంటనే శ్రీరాముడు లేచి, తానే స్వయంగా ఆమె వద్దకు వచ్చి ఇలా అన్నాడు “దేవీ! నీ భర్త లోకంలో అత్యుత్తమ యోధుల్లో ఒకడు, మహావీరుడు. అనేక సద్గుణాలు అతనిలో ఉన్నాయి. కానీ విధి రచనను ఎవరు మార్చగలరు? నిన్ను ఈ స్థితిలో చూడడం నాకు ఎంతో బాధ కలిగిస్తోంది.” ఇక్కడికి నీవు వచ్చిన కారణం ఏమిటో చెప్పు. నేను నీకు ఎలా సహాయం చేయగలనో చెప్పు.” కన్నీళ్లతో నిండిన కళ్లతో సులోచన ఇలా అంది “ ఓ రాఘవేంద్రా! నేను సతీ కావడానికి నా భర్త శిరస్సును తీసుకెళ్లడానికి ఇక్కడికి వచ్చాను “శ్రీరాముడు వెంటనే గౌరవపూర్వకంగా మేఘనాదుని శిరస్సును తెప్పించి సులోచనకు అందించాడు. భర్త తెగిన శిరస్సును చూడగానే సులోచన హృదయం కరిగిపోయింది. ఆమె కళ్ల నుంచి కన్నీళ్లు ధారలుగా పారాయి. అప్పుడు ఆమె పక్కనే ఉన్న లక్ష్మణుని చూసి ఇలా అంది “ఓ సుమిత్రానందనా! మేఘనాదుని వధ నేను చేశానని నీవు గర్వించకూడదు. మేఘనాదుని పడగొట్టే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు. ఇది ఇద్దరు పతివ్రతల భాగ్యం మాత్రమే. నీ భార్య కూడా పతివ్రత, నేనూ నా భర్త పాదాలను అనుసరించిన అనన్య ఉపాసికను. కానీ నా భర్త, పతివ్రత అయిన సీతమ్మ ను అపహరించిన తండ్రి అన్నాన్ని తిని, ఆయన కోసమే యుద్ధం చేశాడు. అందుకే నా పతి పరలోకానికి చేరాడు.” రామశిబిరంలో సులోచనను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తన భర్త శిరస్సు శ్రీరాముని వద్ద ఉందని ఆమెకు ఎలా తెలిసిందో వారికి అర్థం కాలేదు. ఆ సందేహాన్ని తీర్చేందుకు సుగ్రీవుడు అడిగాడు. అందుకు సులోచన స్పష్టంగా ఇలా చెప్పింది . “యుద్ధభూమి నుంచి నా భర్త భుజం ఎగిరి నా దగ్గరకు వచ్చింది. అదే వ్రాసి నాకు తెలిపింది.” అప్పుడు సుగ్రీవుడు వ్యంగ్యంగా! “ప్రాణంలేని భుజం వ్రాయగలిగితే, ఈ తెగిన తల కూడా నవ్వగలదేమో! “అందుకు శ్రీరాముడు సుగ్రీవుని వారిస్తూ ఇలా అన్నాడు “మిత్రమా! వ్యర్థమైన మాటలు చెప్పకు. పతివ్రత మహిమను నీవు తెలుసుకోలేదు. ఆమె కోరితే ఈ తెగిన తల కూడా నవ్వగలదు.” శ్రీరాముని ముఖభావాలను గమనించిన సులోచన ఇలా అంది “నేను మనసుతో, మాటతో, కార్యంతో నా భర్తనే దేవుడిగా భావిస్తే, ఈ నిర్జీవమైన శిరస్సు నవ్వాలి.” ఆ మాట పూర్తయ్యేలోపే ఆ తెగిన శిరస్సు ఘోరంగా నవ్వింది. అది చూసి అందరూ విస్మయానికి గురయ్యారు. పతివ్రత సులోచనకు ఆమె పతివ్రత మహిమను తెలుసుకొని అందరూ నమస్కరించారు. వెళ్తూ వెళ్తూ సులోచన శ్రీరాముని ప్రార్థించింది “ప్రభూ! ఈ రోజు నా భర్త అంత్యక్రియలు జరగాలి. నేను ఆయనతో కలవడానికి వెళ్తున్నాను.ఆదిత్యయోగీ. కాబట్టి ఈ రోజు నా అభ్యర్థనను మన్నించి యుద్ధం నిలిపివేయాలి.” శ్రీరాముడు ఆమె ప్రార్థనను అంగీకరించాడు. సులోచన భర్త శిరస్సును తీసుకొని లంకకు తిరిగివచ్చింది. లంకలో సముద్రతీరంలో చందనంతో ఒక చిత్తిని సిద్ధం చేశారు. భర్త శిరస్సును మడిలో పెట్టుకొని సులోచన చిత్తిపై కూర్చుంది. క్షణాల్లోనే మండుతున్న అగ్నిలో భర్తను అనుసరించింది. ॥శ్రీ రామ జయ రామ జయ జయ రామ ॥.....*