*బోగీ లింక్ విరిగిపడి.. 2km ముందుకెళ్లిన గూడ్స్*
* అనంతపురం: రాయదుర్గంలో గూడ్స్ రైలు నుంచి బోగీలు విడిపోయాయి. ఇనుప ఖనిజం లోడ్‌తో గూడ్స్ రైలు కర్ణాటకలోని మంగళూరుకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. బోగీ లింక్ విరిగిపోవడంతో గూడ్స్ ఇంజిన్ 2 కిలోమీటర్ల మేర ముందుకెళ్లింది. 60 బోగీలు ఉన్న గూడ్స్ రైలులో 6వ బోగీ వద్ద లింక్ తెగిపోయింది. బోగీలు విడిపోవడాన్ని గమనించి అధికారులు గూడ్స్‌ను ఆపారు.
#news #apnews #sharechat #railway


