#⛳భారతీయ సంస్కృతి #🇮🇳 మన దేశ సంస్కృతి #🏛️రాజకీయాలు #షేర్ చాట్ బజార్👍 #👩🎓GK & కరెంట్ అఫైర్స్ .2 లక్షల లంచం తీసుకుంటూ తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఏసీబీకి చిక్కాడు*
ఆదిలాబాద్ | 23-01-2026 :
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కటకం విద్యాసాగర్ రెడ్డి తెలంగాణ అనిశా (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు.
ఫిర్యాదుదారుని పేరిట ఉన్న 8.35 ఎకరాల భూమికి సంబంధించిన సాదా బైనామా రిజిస్ట్రేషన్ దస్తావేజును ప్రాసెస్ చేసి పంపించేందుకు లంచం డిమాండ్ చేసిన విద్యాసాగర్ రెడ్డి, ఫిర్యాదుదారుని నుంచి రూ.2,00,000/- లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే అనిశా అధికారులు వలపన్నించి ఈ దాడిని విజయవంతంగా నిర్వహించారు. ఈ ఘటనతో తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి కలకలం రేగింది. నిందితుడిపై కేసు నమోదు చేసి, తదుపరి విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.


