ShareChat
click to see wallet page
search
#📅 చరిత్రలో ఈ రోజు #🌅శుభోదయం #📙ఆధ్యాత్మిక మాటలు సంపూర్ణ మానవావతారం రాముడు... మనిషనేవాడు ఎలా ఉండాలో, ఎలా జీవించాలో మనకు తెలిపేందుకు దేవుడు రాముడిలా అవతరించాడు... ఎక్కడా లీలలులేవు, మహిమలు ప్రదర్శించలేదు... రాముడు దేవుడని వాల్మీకే ఎక్కడా చెప్పలేదు... రామో విగ్రహవాన్ ధర్మః అన్నాడు..ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం అని..ధర్మాన్ని పోతపోస్తే అచ్చంగా అది రాముడూ అని.... చిన్నతనంలో మనలాగే అల్లరిచేశాడు, మారాంచేశాడు....నవ్వాడు.. ఏడ్చాడు....కానలపాలయ్యాడు... దుష్టశిక్షణ చేశాడు...ధర్మస్థాపన చేశాడు... తండ్రి మాట నిలబెట్టడంకోసం అడవులపాలయ్యాడు..మంచి కొడుకు అనిపించుకున్నాడు... తల్లికిచ్చిన మాట ప్రకారం తమ్మునికి రాజ్యంవదిలేశాడు ...మంచి అన్నలా మిగిలాడు... భార్యను రావణుడు అపహరిస్తే...వారధికట్టి వెళ్లి పతితపావని సీతమ్మను తెచ్చుకున్నాడు..మంచి భర్త అయ్యాడు... ప్రజల్ని బిడ్డల్లా చూసుకుంటూ మంచి రాజు అయ్యాడు... ఇలా అన్నిపాత్రలను సమర్థంగా పోషించి ఆదర్శప్రాయుడయ్యాడు.. ఎందరు దేవుళ్లున్నా మచ్చేలేనివాడు మన రాముడు.. కోటానుకోట్ల దేవతలమీద మనకున్న భక్తి వేరు..రాముడితో ఉన్న దగ్గరితనం వేరు... అన్నీ మంచి లక్షణాలతో రాముడు మనకు మానసికం అయ్యాడు... రాముడు ఈ నేల ఆత్మ... రాముడు విలువలకు ప్రతీక... రాముడు మన సాంస్కృతిక వారసత్వం... రాముడు అందరివాడు...మనవాడు... ఇనవంశోత్తముడు... దశరథ మహారాజు గారాలపట్టి... కౌసల్యామాత కడుపారకన్న బిడ్డడు.. బాలరాముడు కొలువుదీరి ఇంగ్లిష్ కాలెండర్ ప్రకారం సరిగ్గా రెండేళ్లు.. రాముడిలా విలువలతో జీవించే ప్రయత్నం చేద్దాం...రాముడు ఎందుకు గొప్పవాడయ్యాడో, ఎందుకు ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలో ఈ తరానికి చెబుదాం....
📅 చరిత్రలో ఈ రోజు - ShareChat