ShareChat
click to see wallet page
search
#🙏🏻గోవిందా గోవిందా🛕 #✍️ఒరిజినల్ సాహిత్యం #రథసప్తమి #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #శనివారం స్పెషల్ భక్తి ఓం నమో వేంకటేశ్వరాయనమః తిరుమలలో రథసప్తమి సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధిలో శ్రీనివాసుని చూడ రెండు కన్నులు చాలవు! పెద్ద శేషునిపై నిదురించు స్వామికి చిన్న శేష వాహనం పైన చూచిన పాప శేషముండదు! స్వామి సేవాగ్రణ్య గరుడునిపై స్వామి కరుణా మూర్తిని చూడ కష్టముల్ తీరిపోవు! సేవయన్న హనుమనే హనుమంత వాహనంపై బాలాజీని చూచిన గ్రహదోషముల్ పోవును! చక్రస్నానం చేసుకొని కల్పవృక్ష వాహనంపై కలియుగ వైకుంఠుని చూడ కోరికలు తీరిపోవు! రాజాధిరాజులే వచ్చి మ్రొక్కు రమణుని సర్వభూపాల వాహనం చూడు గౌరవం పెరుగు! అమ్మ పద్మావతి చల్లని మనసులా చంద్రప్రభ వాహనంపై వేంకటేశుని చూడు మనశ్శాంతి! వేం*కుభే*రాణి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాస శుక్ల పక్ష తిథి షష్ఠి.