*_రోదసిలో భారతీయవాసి.._*
*_మన సహవాసి_*
#################
భారత్ తొలి వ్యోమగామి
రాకేశ్ శర్మ జన్మదినం..
పుట్టింది...13.01.1949
రోదసీ ప్రవేశం..03.04.1984
+++++++++++++++++
యూరీ గెగారిన్..
జగతిన తొలి వ్యోమగామి..
సోవియట్ భూమికి
గర్వకారణం...
అలెన్ షెపర్డ్..
అమెరికా పేరు అంతరిక్షంలో
లిఖించిన ఆస్ట్రోనాట్..
వలెంటైన తెరిష్కోవ..
రోదసిలో మహిళలకు
తెరిచింది తలుపు..
రష్యా స్త్రీశక్తికి మేలుకొలుపు..!
మరి ఇండియాకి చోటెక్కడ..
నారదుడు మేఘాల
మధ్య తిరిగాడని..
అంతకు మించి ఆపైన
వైకుంఠంలో శ్రీమహావిష్ణువు
కొలువై ఉన్నాడని..
ముక్కంటి తనకు తానే సాటిగా కైలాసగిరిలో
తపోముద్రలో
నిమగ్నమైనాడని..
ఇంద్రుని రాజధాని అమరావతి..
గగనాంతర రోదసిలో
గంధర్వలోక తతులు దాటి
ఉంటే భీముడు
శరాల నిచ్చెన అధిరోహించి
చేరుకున్నాడని..
ఎన్నో చదివామే..
అలాంటి భరతభూమి
నుంచి రోదసి చేరే
నాథుడే లేడా..
ఏమైంది గత కీర్తి..
పురాణాలు పారాయణానికేనా
ఇంతేనా మన ఖర్మ
అనుకునే వేళ
*_వచ్చాడు రాకేశ్ శర్మ.._*
వేదభూమి కీర్తి పతాకను
రోదసిలో ఎగరేసిన
*జాతి ముద్దుబిడ్డ..*
అతడి ఘనతను
చూసి పులకించింది
*భరత గడ్డ..!*
గ్రహరాశులనధిగమించి..
ఘనతారల పధము నుంచి..
రోదసి చేరిన *రాకేశ్* అనే
మానవుడే మహనీయుడు..
శక్తియుతుడు..యుక్తిపరుడు
మానవుడే మాననీయుడు..
*అతడే భారతీయుడు..!*
*_ఊపర్ సే భారత్ కైసే_*
_*దిఖా రహే హై..*_
ఇందిరమ్మ ప్రశ్నకు..
*_జైసే..సారే జహాసే అచ్ఛా.._*
ఈ దృశ్యం అపురూపం..
ప్రియదర్శిని తీయని గళం...
శర్మ విశ్వాసం..
*_మెచ్చింది భారతావని.._*
*_నచ్చింది అవని..!_*
*తలెత్తి చూస్తే ఆకాశం..*
*తలెత్తుకునేలా చేసింది*
*_రాకేశం..!_*
✒️✒️✒️✒️✒️✒️✒️
*_సురేష్ కుమార్ ఎలిశెట్టి_*
విజయనగరం
9948546286
7995666286
#💪పాజిటీవ్ స్టోరీస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱


