*అన్నపురెడ్డిపల్లి మండల అభివృద్ధికి కొత్త ఊపిరి — ఎమ్మెల్యే జారె*
23.01.2026 | శుక్రవారం
అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో గౌరవ *శాసనసభ్యులు జారె ఆదినారాయణ గారు* విస్తృతంగా పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన కీలక పనులను ప్రారంభించి, మరికొన్నిటికి శంకుస్థాపన చేశారు.
మొదటగా మండల కేంద్రంలో రూ.31 లక్షల వ్యయంతో నిర్మించిన *మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) కార్యాలయ భవనాన్ని* ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.15 లక్షలతో నిర్మించనున్న *సైన్స్ ల్యాబ్‌కు శంకుస్థాపన* చేశారు.
అలాగే ఎస్సీ కాలనీలో రూ.11 లక్షల 30 వేల వ్యయంతో నిర్మించిన *సీసీ రోడ్లను ప్రారంభించి,* ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశాన్ని వెల్లడించారు.
తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ అప్‌గ్రేడెడ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో రూ.30 లక్షలతో నిర్మించనున్న *కాంపౌండ్ వాల్ పనులకు కూడా శంకుస్థాపన* చేశారు.
ఇక రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రైతు వేదికలో రూ.8 లక్షల 20 వేల విలువైన *వ్యవసాయ పనిముట్లను రైతులకు పంపిణీ* చేశారు. అలాగే అదే వేదికపై రూ.4 లక్షల 30 వేల విలువైన *కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకాల చెక్కులను* లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో *ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు,* కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #🏛️రాజకీయాలు #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్


