*✳️ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము 📖*
╭┄┅┅─══════════════─┅┅┄╮
🌊 *బండసందులలో జీవజలములు* 🌊 ╰┄┅┅─══════════════─┅┅┄╯
అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము. (యోహాను సువార్త 17:3.)
And this is life eternal, that they might know thee the only true God, and Jesus Christ, whom thou hast sent... Jhon 17:3.
*💥 యేసుని నమ్ము- రక్షణ పొందు- నిత్యజీవము నీదే💥*
Believe in Jesus, receive salvation, and eternal life will be yours.
నా ప్రియమైన సహోదరీ సహోదరుడా,... ప్రతి దినము దేవుడు తన కృపతో మనలను తృప్తిపరచుచున్నాడు. మనము ఈ లోకంలో జీవించుచున్నాము అంటే అది దేవుని కృపయే, ఆయన కృపలేని క్షణమును మనము ఊహించలేము...ఆయన నిన్ను నన్ను తన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు...తన చేతి నీడలో భద్రపరచి ప్రతి క్షణము కూడ మనలను కాపాడుతు ఉన్నాడు. ఈ లోకంలో మన తల్లితండ్రులు, మన బంధువులు, మన స్నేహితులు అందరు మనలను విడిచిన నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఒక్క క్షణమైనను విడువక యెడబాయక, తల్లిలా లాలిస్తూ తండ్రిలా ప్రేమిస్తు అన్ని విషయములలో మనకు ఆదరణ కలిగిస్తున్నాడు. మన దేవుడు ఎంతో గొప్పవాడు కృపగల దేవుడు కంటికి రెప్పలా కాపాడుచున్నాడు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టు చున్నది (విలాపవాక్యములు 3:23)
*మన సృష్టికర్తయైన దేవుడు ఈ లోకంలో ఉన్న సృష్టి అంతటిని తన నోటి మాట ద్వారా కలుగజేసి మనలను తన చేతులతో ఎంతో అందంగా తయారుచేసి తనరూపులోకి మలచి తన జీవాత్మను మనలో అనుగ్రహించాడు. ఈ రోజు మనము బ్రతుకుచున్నామంటే ఆయన ఊపిరితోను....,.ఆయన జీవాత్మను పొందుకున్న నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా ? మీకు తెలుసా..! ఈ లోకంలో ఉన్న సృష్టి యావత్తు దేవుని స్తుతిస్తాయి, చెట్లు, పక్షులు, జంతువులు, సముద్రాలు, జలములు, సమస్తమును కూడ ఆయనను స్తుతిస్తూ ఉన్నాయి. అంతేకాదు సకల దేవతలు కూడ ఆయనకు నమస్కరిస్తాయి(కీర్తనలు 96:7) కానీ నేటి మానవుడు దేవుని ఎరుగక దేవుడు అనుగ్రహించే మేలులను కోల్పోతున్నాడు...But modern man, not knowing God, is missing out on the blessings that God bestows.*
నిన్ను నన్ను రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు...ఆయన చేతిపనియైన మనము నశించిపోకూడదు అని మన శిక్షఅంతటినీ తానే భరించి మనకు విమోచన ఇచ్చారు....అంతేకాదు నీవు దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనే నిజమైన దేవుడు అని యెరిగినట్లయితే దేవుడు మనకు నిత్య జీవమును ఇస్తానని వాగ్ధానం చేశారు......📜
*నా ప్రియమైన సహోదరీ సహోదరుడా.....మనము ఈ భూమిపైన జీవించేది కొద్దికాలమే... భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్ట బడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము. ( 2. కొరింథీయులకు 5:1 ) మన కొరకు దేవుని చేత కట్టబడుచున్న నిత్యమైనా ఆ నివాసపురము లోకి చేరాలి అంటే యేసే నిజమైన దేవుడు నిత్యజీవము అనుగ్రహించు దేవుడు అని తెలుసుకొని రక్షణ పొందినట్లైతే ఈ లోకాశలను విడిచిపెట్టి ఆత్మ ఫలము కలిగి మంచి ప్రవర్తన కలిగి క్రీస్తులో అంటుకట్టబడి జీవిస్తున్నట్లయితే .....ఆ గొప్ప అందమైన రాజ్యంలో ప్రవేశించగలము....లేకపోతే మన అంతం చివరకు బహు భయంకరము (అగ్ని ఆరని పురుగు చావని ఆ భయంకరమైన అగ్ని గుండంలో యుగ యుగములు నిత్య అగ్నిలో కాలాలి.)*
ఓ సోదరి సోదరా యోచించు...!
నీ జీవిత అంతం ఎటు. నిత్యజీవమా/నిత్యనరకమా. ఈ క్షణమైనా నీ సృష్టికర్తను, నీ రక్షకుని తెలుసుకో నిత్యజీవమును పొందుకో........ దేవుడు తన అరచేతుల్లో మనలను చెక్కుకున్నాడు..దినమెల్ల తన రెండు చేతులు చాచి నిన్ను పిలుచుచున్నాడు ఈరోజైన నా కుమారుడు, నా కుమార్తె నా స్వరము విని నా దగ్గరకు వస్తారని ఆయన ఎంతో ఆశ పడుతున్నారు... నిన్ను హక్కున చేర్చుకొని నిన్ను దీవించాలని, ఆశీర్వాదించాలని నిత్యజీవము అనుగ్రహించాలని......
*ఈరోజు ఆయన స్వరము విందాం ఆయనను హత్తుకొని📓📖 జీవిద్దాం 🛐 దేవుడు అనుగ్రహించే నిత్యజీవమును పొందుకుందాం- దేవుని చేత కట్టబడుచున్న నిత్యమైనా ఆ నివాసపురములో దేవునితో పాటు యుగ యుగములు జీవిద్దాం..Let us live with God for all eternity in that eternal dwelling place being built by God.*
*అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక...! ఆమేన్.*
*🛐ప్రార్థన:- ప్రభువా ప్రతి దినము నీ కృపతో మమ్ములను తృప్తిపరచుచున్నందుకు స్తోత్రం. నీ కృప ద్వారానే మేము జీవిస్తున్నాము, నీ కృప లేని క్షణము మేము ఊహించలేము, నీ శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నందుకు స్తోత్రం. అందరు మరచిపోయిన నీవు విడువక ఎడబాయక కాపాడుచున్నందుకు స్తోత్రం. నీలో అంటుకట్టబడి, ఆత్మఫలములు ఫలిస్తూ నిత్య నివాసమైనా పరలోకరాజ్యములో చేరే ధన్యతనిమ్ము. నిన్ను ఎరిగి నీవు అనుగ్రహించు దీవెనలు పొందుకొనే భాగ్యమునిమ్ము నీ స్వరము విని, నిన్ను హత్తుకొని,నిత్యజీవము పొందుకొని దేవుని చేత కట్టబడుచున్న ఆ నిత్యమైన నివాసపురములో యుగయుగములు జీవించే ధన్యత నిమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొన్నాము మా పరమతండ్రి ఆమేన్*
💓 *హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖
🙏 *మా గురించి మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకము చేసుకుంటున్నారని విశ్వసిస్తున్నాము. అంతకుమించి మీనుండి ఏదియు మేము ఆశించటములేదు.*
👉 *మీకు పంపుతున్నా అను దిన ఆత్మీయ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు తెలపగలరు.*
👉 *అను దిన ఆత్మీయ సందేశాలు* ప్రతి రోజు కావలసిన వారు
*WhatsApp లో నుండి మాత్రమే సంప్రదించండి* - *9573770951*
GOD SERVANT
*దైవాశ్శీసులు!!!*
👉 మీ మిత్రులకు SHARE చేసి మీ వంతుగా దేవుని పని చేయండి.
#యేసయ్య #teluguchristian #💖నా యేసయ్య ప్రేమ #christian #bible @యేసుక్రీస్తు అందరికి ప్రభువు


