#Every day my Status #ఉషోదయం # పంచాంగం #నేటి రాశిఫలితాలు
🌹 మిత్రులకు శుభోదయం 🌹
💐 ఫిబ్రవరి 01 ఆదివారం 💐
🌹🌹 01/02/26 💐💐
ఈరోజు జన్మదినాన్ని/వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు - దీర్ఘాయుష్మాన్ భవ!
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺
🍀
*01, ఫిబ్రవరి, 2026*
*దృగ్గణిత పంచాంగం*
➖➖➖✍️
*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం*
*శిశిర ఋతౌః / మాఘమాసం / శుక్ల పక్షం*
*తిథి : పూర్ణిమ* రా 03.38 వరకు ఉపరి కృష్ణ పాడ్యమి
*వారం : ఆదివారం* (భానువాసరే)
*నక్షత్రం : పుష్యమి* రా 11.58 వరకు ఉపరి ఆశ్లేష
*సూర్యోదయాస్తమాలు:*
ఉ06.38;సా06.05విజయవాడ
ఉ06.48;సా06.11హైదరాబాద్
*సూర్యరాశి : మకరం చంద్రరాశి : కర్కాటకం*
*యోగం : ప్రీతి* ఉ 10.19 వరకు ఉపరి ఆయుష్మాన్
*కరణం : భద్ర* సా 04.42 బవ రా 03.38 ఉపరి బాలువ
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 07.00 - 09.00 మ 02.00 - 04.00*
అమృత కాలం : సా 05.59 - 07.29
అభిజిత్ కాలం : ప 11.58 - 12.44
*వర్జ్యం : ఉ 09.02 - 10.31*
*దుర్ముహూర్తం : సా04.32- 05.18*
*రాహు కాలం : సా04.38- 06.04*
గుళికకాళం : మ 03.12 - 04.38
యమగండం : మ 12.21 - 01.47
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :ఉ 06.38- 08.55
సంగవ కాలం : 08.55 - 11.13
మధ్యాహ్న కాలం : 11.13 - 01.30
అపరాహ్న కాలం :మ01.30- 03.47
*ఆబ్ధికం తిధి : మాఘ పౌర్ణమి*
సాయంకాలం :సా 03.46- 06.04
ప్రదోష కాలం :సా06.04- 08.35
రాత్రి కాలం :రా 08.35- 11.56
నిశీధి కాలం :రా 11.56 - 12.46
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.57 - 05.48.✍️
➖▪️➖
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*01-02-2026-ఆదివారం*
*రాశి ఫలితాలు:*
➖➖➖✍️
```
మేషం
ఇంట బయట గౌరవం పెరుగుతుంది. నూతన వస్తు లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుంటారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి. దైవ చింతన కలుగుతుంది.
వృషభం
దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. కొన్ని విషయాలలో కుటుంబ సభ్యుల ప్రవర్తన విసుగు కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సన్నిహితులతో అకారణ వివాదాలు కలుగుతాయి. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన రీతిలో పనులు పూర్తికావు.
మిధునం
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ధనాదాయ మార్గాలు మరింత విస్తరిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
కర్కాటకం
ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.
సింహం
బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. చివరి నిమిషంలో ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారాలు మందగిస్తాయి.
కన్య
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. వాహన ప్రయాణ విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
తుల
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కీలక వ్యవహారాల్లో జీవితభాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. విద్యా అనుకూలత కలుగుతుంది.
వృశ్చికం
సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రుసమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది. అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధన విషయాల్లో సోదరులతో వివాదాలు సర్దుమణుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
ధనస్సు
సన్నిహితులతో తగాదాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. సంతానం విద్యా ఫలితాలు లభిస్తాయి. దూరప్రాంత ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి.
మకరం
ఋణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాల వలన శ్రమ పెరుగుతుంది. బంధు వర్గం నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో కొత్త సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున ప్రతికూల పరిస్థితులుంటాయి.
కుంభం
కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సోదరవర్గం వారితో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. భూ క్రయ విక్రయాల లాభిస్తాయి.
మీనం
అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. ఋణ ప్రయత్నాలు కలిసిరావు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. గృహమున గందరగోళ వాతావరణం ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించిన సమస్యలను ఎదుర్కొంటారు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.✍️```
***************************
. *శుభమస్తు!* ______________________________
*గోమాతను పూజించండి*
*గోమాతను సంరక్షించండి*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.*
💐💐 సేకరణ 💐💐


