ShareChat
click to see wallet page
search
*విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన మరింత పెంపొందించాలి — ఎమ్మెల్యే జారె ఆదినారాయణ* దమ్మపేట మండల కేంద్రంలోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్‌లో యాజమాన్యం ప్రత్యేకంగా నిర్వహించిన *సైన్స్ ఫెయిర్–2025–26* కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు జారె *ఆదినారాయణ గారు ముఖ్య అతిథిగా* హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ శాస్త్రీయ ప్రాజెక్టులను ఆయన ఆసక్తిగా పరిశీలించారు. చిన్న వయసులోనే విద్యార్థులు చూపిన సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచన విధానం ప్రశంసనీయమని పేర్కొంటూ వారిని అభినందించారు. అనంతరం మాట్లాడుతూ, “నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు. పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా ఇలాంటి సైన్స్ ఫెయిర్‌ల ద్వారా ప్రయోగాత్మక జ్ఞానం సంపాదించాలి. శాస్త్ర సాంకేతిక విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. విద్యార్థుల ప్రతిభను వెలికితీసే ఇలాంటి కార్యక్రమాలను మరింత ప్రోత్సహిస్తాం” అని తెలిపారు. ఇలాంటి విద్యాపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో *ఆత్మకమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు,* *స్థానిక సర్పంచ్ పగడాల రమాదేవి,* *మందలపల్లి సర్పంచ్ గుజ్జుల శ్రీనివాసరావు,* *దిశా కమిటీ సభ్యురాలు సొంగా ఏసుమణి,* *చిన్నంశెట్టి యుగంధర్,* *పగడాల రాంబాబు,* కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. #కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #🏛️రాజకీయాలు
కాంగ్రెస్ - ShareChat