*ముక్కోటి ఏకాదశి కి ముస్తాబైన వాడపల్లి దేవాలయం*
*ఉదయం 5 గంటల నుంచి ఉత్తరద్వార దర్శనం*
ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి పర్వదినానికి కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం ముస్తాబైంది. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తారు.ఈ పర్వదినాన్న స్వామి వారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తారు.అందుకనే అనేక రకాల పష్పలతో దేవాలయ ప్రాంగణమంతా అద్భుతంగా తీర్చిదిద్దారు.
స్థానికంగా లభ్యమయ్యే బంతి, చామంతి పూలతో పాటు బెంగళూరుకు చెందిన అనేక రకాల అరుదైన పుష్పాలు, పత్రాలతో అలంకరించారు.ఆలయ ప్రాంగణమంతా ఈ పూల అలంకరణతో కళకళాడిపోతుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వచ్చే భక్తులు కోసం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాటు చేసింది.ఈ దేవస్థాన ధర్మ కర్తల మండలి ప్రమాణ స్వీకారం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది.మర్నాడే అంటే మంగళవారం ముక్కోటి ఏకాదశి రావడం నూతన ధర్మకర్తల మండలిలో ఎక్కడలేని ఉత్సాహం నెలకొంది. :- #🌲పచ్చని చెట్లు🌲 #🌼బ్యూటిఫుల్ Flowers #😇My Status #🎋మా పల్లె అందాలు #😃మంచి మాటలు

