*✳️ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము 📖*
╭┄┅┅─══════════════─┅┅┄╮
🌊 *బండసందులలో జీవజలములు* 🌊 ╰┄┅┅─══════════════─┅┅┄╯
*ప్రభువే ఆత్మ. ప్రభువు యొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. 2 కొరింథీయులకు 3:17.*
Now the Lord is that spirit and where the spirit of the Lord is, there is liberty... 2 corinthians 3:17.
*💥 క్రీస్తులో మనకు స్వేచ్చ💥*
We Have Freedom In Christ
నా ప్రియమైన స్నేహితులారా..! క్రీస్తు మనలను పాపం శిక్ష నుంచి, బానిసత్వం నుండి విడుదల నిచ్చారు.. మన పితరులు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నో కష్టాలను,శ్రమలను,బాధలను,వేదనలను, దుఃఖమును, అనుభవించారు, కన్నీరు కార్చారు, ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు గడిపారు, ఆ బానిసత్వపు శిక్ష భరించలేక దేవునికి మొర్రపెట్టారు. ఎంతో దయను, కనికరముగల దేవుడు ఒక ప్రవక్తను వారి దగ్గరకు పంపించి ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించి ఎంతో సమృద్ధిగా ఉండే పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించి వారికి స్వేచ్ఛను అనుగ్రహించారు..
ఈ సందేశము చదువుతున్న మీరు కూడా ఏ విషయములలోనైనను బానిసగా ఉండి ఆ స్థితి నుంచి బయటకు రాలేక నిరాశతో ఉన్నావా సంతోషం, సమాధానము, నెమ్మది లేక , నీలో నీవే కృంగిపోతూ వేదన చెందుతూ దుఃఖంతో ఉన్నావా, ఎవ్వరికీ చెప్పుకోలేని సమస్యలతో నీలో నీవే కృంగిపోతూఉన్నావా అయితే ఈ క్షణమే దేవునికి మొర్రపెట్టు ఆయన నీ కన్నీరు తుడిచి నిన్ను ఓదార్చి నీ స్థితిగతులను మార్చివేసి ఆయన నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తారు.
ప్రియమైన సహోదరీ సహోదరుడా..! ఈ రోజు మీరు ఏ దాస్యము క్రింద ఉన్నారు? ఈనాడు చాలా మంది పాపముల చేతను, అపరాధముల చేత, సాతాను యొక్క బానిసత్వం క్రింద త్రొక్కబడుతూ ఉన్నారు, Today, many people are being oppressed and enslaved by Satan through sins and misunderstandings. యేసయ్య తన స్వరక్తం ద్వారా మనలను కొనుక్కుని సాతాను ఆధిపత్యం బానిసత్వం నుంచి మనలను విడిపించి మనకు స్వాతంత్ర్యము అనుగ్రహించాడు. క్రీస్తు రక్తముతో కొనబడిన నీవు ఆయనకు ఇష్టం గా జీవిస్తూ ఉన్నావా, వాక్యము ద్వారా నిన్ను నీవు సరిచేసుకుంటూ క్రీస్తును కలిగి యున్నావా...... ఒక్కసారి పరిక్షించుకో..
ఒక చిలుక పంజరములో ఉన్నప్పుడు తన యజమాని మాట వింటూ ఆ యజమానుడు ఎప్పుడు అన్నం పెడితే అప్పుడే తినాలి అయితే, ఆ చిలుక ఎప్పుడైతే పంజరములో నుంచి బయటకు వస్తుందో అప్పుడు దానికి స్వేచ్ఛ దొరుకుతుంది. అయితే అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. 1కొరింథీ 10:23లో)..మనకు అన్నీ విషయములో స్వేచ్ఛ ఉంది అని లోకానుసారంగా జీవించక ఆత్మ ఫలము ఫలిస్తూ మంచి క్రియలు చేయాలి. since we have free will, we should not live according to the ways of the world, but, instead bear the fruits of the spirit and perform good works.. సాటి మనిషికి సహాయం చేస్తూ, ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ, నీతి క్రియలు చేయుచు దేవుని సువార్తను అనేకులకు ప్రకటించాలి.. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి.....దేవుని వాక్కులో నిలిచి వుండి ఆయన వాక్యానుసారంగా జీవిస్తు ఆయన అడుగుజాడల్లో నడుస్తు ఆయన పోలికలోకి రూపాంతరం చెందాలి..... ఆమేన్.
*🛐ప్రార్థన:- మా పాపపు శిక్ష నుండి, బానిసత్వము నుండి మమ్మల్ని విడుదల చేసిన దేవా, నీకు స్తోత్రములు. మా పితరుల ప్రార్థనలను ఆలకించి, వారిపై దయ కనికరములు చూపి, వారి బాధలు, దుఃఖాలు, వేదనల నుండి విడిపించి, కానాను దేశమునకు నడిపించి స్వేచ్ఛను అనుగ్రహించిన దేవా, నీకు స్తోత్రములు. నెమ్మది, సమాధానం లేక నిరాశ నిస్పృహలలో ఉన్నవారి కన్నీటి ప్రార్థనలను ఆలకించి, వారి స్థితిగతులను మార్చి, సమృద్ధిగా ఆశీర్వదించిన దేవా, నీకు స్తోత్రములు. సాతాను బానిసత్వము నుండి మమ్మల్ని విడుదల చేసిన దేవా, నీకు స్తోత్రములు. మాకు ఇచ్చిన స్వేచ్ఛతో లోకానుసారంగా జీవించకుండా, మంచి క్రియలు చేస్తూ నీకు మహిమకరంగా జీవించే ధన్యతను మాకు దయచేయుము. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొన్నాము మా పరమతండ్రి ఆమేన్*
💓 *హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖
🙏 *మా గురించి మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకము చేసుకుంటున్నారని విశ్వసిస్తున్నాము. అంతకుమించి మీనుండి ఏదియు మేము ఆశించటములేదు.*
👉 *మీకు పంపుతున్నా అను దిన ఆత్మీయ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు తెలపగలరు.*
👉 *అను దిన ఆత్మీయ సందేశాలు* ప్రతి రోజు కావలసిన వారు
*WhatsApp లో నుండి మాత్రమే సంప్రదించండి* - *9573770951*
GOD SERVANT
*దైవాశ్శీసులు!!!*
👉 మీ మిత్రులకు SHARE చేసి మీ వంతుగా దేవుని పని చేయండి.
#teluguchristian #💖నా యేసయ్య ప్రేమ #యేసయ్య #christian #bible


