ShareChat
[#సస్పెండెడ్_కాఫీ అంటే మీకు #తెలుసా? నార్వే లో ఒక రెస్టారెంట్ కౌంటర్ లో డబ్బులు ఇస్తూ ఒక మహిళ, "Five coffee, two suspended" అంటూ ఐదు కాఫీలకి సరిపడా ఇస్తూ, మూడు కాఫీ కప్పులు తీసుకుని వెళ్ళింది. మరొకరు వచ్చి, "Ten coffee, five suspended", అని పదికి డబ్బు కట్టి, ఐదు కాఫీలు పట్టుకుపోయాడు. అలాగే మరొకరు, "Five meals, two suspended", అని మూడే భోజనం ప్లేట్లు తీసుకున్నారు. ఇదేమిటో అర్థం కాలేదా......? కాసేపటికి ఒక ముసలాయన, చిరిగిన బట్టలతో కౌంటర్ దగ్గరకు వచ్చి, "Any suspended coffee?" అని అడిగాడు. కౌంటర్ లో ఉన్న మహిళ, "Yes", అని, వేడి వేడిగా ఒక కప్పు కాఫీ ఇచ్చింది. పేదరికంలో ఉన్న ముక్కు మొహం కూడా తెలియని మనుషులకు మనసుతో చేసే సహాయం ...... ఇదే మానవత్వం . ఇందులో విశేషం ఏమిటంటే, మన పక్కనే ఉన్న #నేపాల్_దేశంలో ప్రారంభమైన ఈ మంచి అలవాటు ప్రపంచంలో అనేక చోట్లకు వ్యాపించింది కానీ మన దేశంలో ఇంకా ఈ మంచి అలవాటు ప్రారంభం కాలేదు.. మనం ప్రారంభిద్దామా ఫ్రెండ్స్..... #help poor people 🙏❤️🙏 #🙏మన సాంప్రదాయాలు