#🇮🇳టీమ్ ఇండియా😍 #🏏క్రికెట్ 🏏 రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తును తమ కెరీర్‌లో చెప్పుకోదగ్గ విజయాలు సాధించని వారు నిర్ణయించడం దురదృష్టకరమని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నాడు. రోహిత్, కోహ్లీలు ప్రపంచ కప్ 2027లో ఉంటారా అనే ప్రశ్నకు ఒక ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ స్పందించాడు.తమ కెరీర్‌లలో పెద్దగా సాధించని వ్యక్తులు కూడా స్టార్ క్రికెటర్ల భవితవ్యాన్ని నిర్దేశిస్తున్నారని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. తనకు, తన సహచరులకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని గుర్తు చేశాడు. ఇది చాలా దురదృష్టకరమని, అయినప్పటికీ తాము దాని గురించి మాట్లాడబోమని, చర్చ చర్చించబోమని స్పష్టం చేశాడు.విరాట్ కోహ్లీ ఇంకా చాలా బాగా ఆడుతున్నాడని, ఈ విషయం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని హర్భజన్ సింగ్ అన్నాడు. రోహిత్, కోహ్లీ ఎప్పటికీ గొప్ప ఆటగాళ్లేనని, జట్టు కోసం బ్యాటర్లుగా, కెప్టెన్లుగా ఎంతో చేశారని అన్నాడు
#fbifestyle #HarbhajanSingh #rohithsharma #viratkohli


