ShareChat
click to see wallet page
search
#📰జాతీయం/అంతర్జాతీయం #🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువు పెంపు. డిసెంబరు 6 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిన విద్యాశాఖ. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపునకు మొదట ఈ నెల 30 గడువుగా నిర్ణయించినప్పటికీ, విద్యాశాఖ దాన్ని పొడిగించింది. డిసెంబరు 7 నుంచి 9 వరకు రూ.50 అపరాధ రుసుముతో, 10 నుంచి 12 వరకు రూ.200 అపరాధ రుసుముతో, 13 నుంచి 15 వరకు రూ.500 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించవచ్చు. హాల్ టికెట్‌లో పేరు లేదా ఇతర వివరాలు తప్పుగా నమోదైతే, వాటిని సవరించుకోవడానికి డిసెంబరు 16 నుంచి 20 వరకు అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీంబాషా తెలిపారు.
📰జాతీయం/అంతర్జాతీయం - 10వుతర్రగతి విద్యార్థలకు గరుడెన్యూసొంం SBIEDUCATION 10వుతర్రగతి విద్యార్థలకు గరుడెన్యూసొంం SBIEDUCATION - ShareChat