ShareChat
click to see wallet page
search
🙏🌺ప్రతి ఇంటిలో దక్షిణామూర్తి యొక్క పటము ఖచ్చితంగా ఉండాలి. 🌺🙏 🌺దక్షిణామూర్తి పటాన్ని ఉంచి ఏ ఇంటిలో పది నిమిషాలు రోజు ఆయనను చూస్తూ దక్షిణా మూర్తి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో అటువంటి వారికి ఇంటిలో కష్టములు ఉండవు. దక్షిణామూర్తిని చూసేటటువంటి వారికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించేటటు వంటి వారికి తెలియక చేసినటువంటి పాపములు నశిస్తాయి. వారికి రాబోవు కష్టములు తొలగించి వారిని దక్షిణామూర్తి రక్షిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. 🌺 🌺ఏ దయవలన దుఃఖం పూర్తిగా నిర్మూలనమవుతుందో ఆ 'దయ'ను 'దాక్షిణ్యం' అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి (దాక్షిణ్యం) భగవంతునికి మాత్రమే ఉంది. ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి. అన్ని దుఃఖాలకీ కారణం అజ్ఞానం. అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖవిమోచనం. ఆ అజ్ఞానాన్ని (అవిద్యను) తొలగించే జ్ఞాన స్వరూపుని దాక్షిణ్య విగ్రహమే దక్షిణామూర్తి. వసిష్ఠుడు కూడా తపస్సుతో దక్షిణామూర్తిని ప్రత్యక్షం చేసుకొని బ్రహ్మవిద్యను సంపాదించాడు. 🌺 ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః🌺 _________________________________________ HARI BABU.G ___________________________________________ #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🥰💝dakshinamurthy 🙏🙏❤️ #dakshinamurthy #గురు పౌర్ణమి శుభాకాంక్షలు 1
🙏🏻గురువారం భక్తి స్పెషల్ - ShareChat