#గీతా జయంతి ... శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతని ఉపదేశించిన రోజు ఇది 🙏 #గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంధం 'భగవద్గీత' పుట్టినరోజు 🕉️🙏🙏🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #'భగవద్గీత' సృష్టిలో ఏకైక దైవ గ్రంధం #గీత జయంతి
*గీతా రక్షతి రక్షిత:*
శ్రీకృష్ణ పరమాత్మ తన అవతార జీవితకాలం అనగా ద్వాపర యుగంలో రెండు మనోజ్ఞ మనోహర గానాలను చేశారు. వాటిలో ఒకటి మురళీ గానం అదే వేణుగానం. రెండవది గీతా గానం.
ద్వాపరయుగంలో మురళీగాన మాధుర్యాన్ని గోపికలు పూర్తిగా ఆస్వాదించి తన్మయులయ్యారు. కృష్ణునిలో ఐక్యమయ్యారు. ఆ గానం మనకు తెలియదు. ఆది వినే భాగ్యం మనకు కలుగలేదు. కాని దానిని మించినది గీతా గానం. పాడిన వారికీ పాటకూ భేదము లేదు. పరమాత్మకు గీతకు భేదము లేదు. ఇరువురిదీ అవినాభావ సంబంధము. శ్రీకృష్ణుని నిశ్వాసమే గీత. హృదయమే గీత. భగవన్ముఖారవిందమగు గీతాగాన స్రవంతిలో జలకమాడినవారి పాపజాలము నశించిపోతుంది. ముక్తి కరతలామలకమవుతుంది. గీతను శ్రవణం చేసేందుకైనా నోచుకున్న జీవరాసుల భాగ్యమే భాగ్యము. గీత ఉపదేశరూపమైన ఒక మహాలీల. ఇది ఒక కాలమునకు గానీ, దేశమునకు గాని, మతానికిగానీ, జాతికిగాని సంబంధించినది కాదు. అది సార్వజన, సార్వభౌమ, సార్వకాలీన సత్యశివసుందర భగవద్వాణి. ముల్లోకజనులకు ఉపయుక్తమైనది. సర్వ శాస్త్ర సిద్ధాంత సమన్వయ రూప గ్రంథము. సర్వ మత సంప్రదాయ తత్త్వములను పోషించేది. అన్నంటికి ప్రామాణిక గ్రంథరాజము. సకల మతములలోని ప్రధాన సూత్రాలు, ధర్మాలు ఇందులో క్రోడీకరించబడినవి. ధర్మ వృక్షమే గీత.
సర్వధర్మ సమన్వయ క్షేత్రం ఈ గీత. సకల సంప్రదాయముల సమన్వయం కావున ఇది విశ్వ మత గ్రంధమై విరాజిల్లుతోంది. గీత అనే రెండక్షరాలలో ఎంతో అర్ధం నిబిబడీకృతమై ఉంది.
*'గీ' కారం త్యాగరూపస్యాత్ 'త' కారం తత్త్వ బోధకం*
*గీతావాక్యమిదం తత్త్వం జ్ఞేయం సర్వ ముముక్షుభిః*
'గీ' కారం త్యాగమును, 'త' కారం తత్త్వమును ఆత్మస్వ రూపంగా ఉపదేశించునది అని దీని అర్ధము. సర్వ శాస్త్రమయీ గీత అని స్కాందపురాణ వాక్యం. ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం అని, గేయం గీతానామ సహస్రమని ఆదిశంకరుల వారి అభిప్రాయం. గీతోపదేశం జరిగిన ప్రదేశం కురుక్షేత్ర యుద్ధ భూమి, కురుక్షేత్ర యుద్ధం ఒక విచిత్రమైన యజ్ఞం. హోమ గుండం అర్జునుని ముఖం. హోమ ద్రవ్యం గీతోపదేశం. హోత శ్రీకృష్ణుడు. ఫలం కైవల్యం. భగవంతుడు అనంతుడు. అనంతో వైవిష్ణుః అని వేదం. భగవద్వాణి కూడా అనంతమే కదా!
కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణవాణి భగవద్వాణీయే. భగవద్గీత వైశిష్ట్యం అనంతం, ఆపారం, అలౌకికం. గీత ధర్మాత్ములకు రక్ష.
*🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*


