ShareChat
click to see wallet page
search
#🌟శ్రీ గాయత్రి దేవి🙏 #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 #శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు 🙏 🔱🕉️🔱🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శ్రీ కనకదుర్గమ్మ వైభవం 🔱 ఇంద్రకీలాద్రి - బెజవాడ (విజయవాడ)🙏 *సూర్యశక్తే గాయత్రి* సూర్యభగవానుని శక్తి (అతని కాంతియే) గాయత్రీ. ఈమెకు మరో పేరు సావిత్రి. సావిత్రి అనగా 'సవితః ఇయం' అని వ్యుత్పత్తి. సవిత అనగా సూర్యుడు. సూర్యకాంతి, సూర్యతేజస్సే సావిత్రి. సూర్య శక్తిని తార, గాయత్రి, సావిత్రి అని అంటారు. _అమ్మవారి నేటి అలంకారం_ సకల వేద స్వరూపం, సకల మంత్రాలకు మూలశక్తి గాయత్రిదేవి. వివిధ వర్ణాలు గల పంచ ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆదిశంకరులు గాయత్రీదేవిని అనంతశక్తి రూపంగా అర్చించారు. ప్రాతఃకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను, సాయంత్రం సరస్వతిగాను ఆరాధనలు అందు కుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువై ఉంటారని పురాణాలు చెపుతున్నాయి. ఈమెను ధ్యానిస్తే అనంతమంత్రశక్తి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతమై చతుర్వేద పారాయణ ఫలితం దక్కుతుంది. *'ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం, భర్గోదేవస్య ధీమహి థియో యోనః ప్రచోద యాత్' అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి. గాయత్రి స్తోత్రాలు పారాయణ చేయాలి.* *నైవేద్యం: అల్లం గారెలు. పాయసం, లడ్డూలు* హిరణ్యగర్భ విద్య, వేదశాస్త్రములను అనుసరించి, సకల జగత్ సృష్టికి సూర్యుడే ఆధారం. సూర్య మండలం ఆగ్నేయాన ఉంది. అందువల్ల దీనిని హిరణ్మయము అని అంటారు. ఈ హిరణ్మయ మండల కేంద్రంలో సూర్య రూపు డైన పరబ్రహ్మతత్త్వము ప్రతిష్టించబడింది. అందువల్ల బ్రహ్మను హిరణ్యగర్భుడు అంటారు. ఈ సూర్య భగవానుని శక్తే (అతని కాంతియే) గాయత్రీ. ఈమెకు మరో పేరు సావిత్రి. సావిత్రి అనగా 'సవితః ఇయం' అని వ్యుత్పత్తి. సవిత అనగా సూర్యుడు. సూర్యకాంతి, సూర్య తేజస్సే సావిత్రి. సూర్య శక్తిని తార, గాయత్రి, సావిత్రి అని అంటారు. సూర్యభగవానుడు బృహతీ అను మహా విశ్వగోళ మధ్యభాగంలో స్థిరంగా ఉంటూ లోకాన్ని ప్రకాశింప చేస్తాడు. *"సవితుః వరేణ్య భర్గః ధీమహి |* *యోనః ధియః ప్రచోదయాత్ ||"* అని మంత్రము. ఈవిధంగా సూర్యభగవానుని సర్వ శ్రేష్టమైన తేజస్సును ధ్యానం చేయడం ద్వారా ఆ తేజస్సే మన బుద్ధిని మంచిదారిలో ప్రేరేపిస్తుందని గాయత్రీ మంత్రా ర్థము. ఇతర ఆగమాలానుసారం నారాయణుని రూపమే సూర్యభగవానుడు. నారాయణుని దివ్యకాంతియే గాయత్రీ. గాయత్రీ అనగా 'గాయంతం త్రాయత ఇతి గాయత్రీ' అనగా గానము, ధ్యానం చేసేవారిని రక్షించేది. స్త్రీ రూపమైన గాయత్రీ ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ ఛాయైః అని ఐదు రంగుల గల ఐదు ముఖ ములు కలిగి ఉంటుంది. అలాగే చంద్రశేఖర తత్త్వంలో మూడునేత్రాలను, పది చేతుల్లో పది రకాల ఆయుధాలను కలిగి ఉంటుంది. ఈ రూపం పరమాత్మను చేరవలసిన జీవాత్మ స్వరూపం. అమ్మ ఐదు ముఖాలలో 'ముక్త పరమాత్మ స్వరూపం, 'విద్రుమ’ జీవాత్మ స్వరూపం, 'హేమ' ప్రాప్తి ఉపాయం, 'నీలం' ప్రాప్తికి విరోధి, ‘ధవళ' ప్రాప్తి ఫలం. పది చేతులలోని పది ఆయు ధాలు ఇంద్రియాలు చేయవలసిన పది పనులు. జిహ్వ, నాసిక, నేత్రములు మొదలైన ఈ పది ఇంద్రియాలు పర మాత్మ సేవకు, ధ్యానానికి ఉపయోగించాలి. ఈవిధంగా ఇంద్రియాలనే చేతులలో కర్తవ్యాలను ఆయుధాలుగా చేసు కుని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ద్వేష, అసూయ, ఈర్ష్య, స్వార్థం అనే పది మంది శత్రువులను గెలవాలని గాయత్రీ మాత అవతార ఉపదేశం. ఈ సత్యాన్ని తెలుసుకుని ఆచరించి, అనుసరించి అమ్మ అనుగ్రహం పొందాలి. #namashivaya777
🌟శ్రీ గాయత్రి దేవి🙏 - App Praja ఈ రోజు అమ్యవారి అలంకరణ శ్రీగాయత్రీ దేవి @೦ PSVAPPARAO App Praja ఈ రోజు అమ్యవారి అలంకరణ శ్రీగాయత్రీ దేవి @೦ PSVAPPARAO - ShareChat