*ప్రెస్ నోట్*
*గుంటూరు జిల్లా పోలీస్…*
*నగరంపాలెం పోలీస్ స్టేషన్*
*తేది: 07.12.2025*
_*// గంజాయి అమ్మకం మరియు కొనుగోలు కేసులో 6 మంది నిందితులను అరెస్ట్ చేసి, 2 కిలోల గంజాయి స్వాధీనం చేసిన నగరంపాలెం పోలీసులు,.//*_
📍 గుంటూరు జిల్లా S.P శ్రీ వకుల్ జిందల్, I.P.S. గారి ఆదేశాల మేరకు, గుంటూరు పశ్చిమ డీఎస్పీ శ్రీ K. అరవింద్ గారి పర్యవేక్షణలో, నగరంపాలెం సీఐ శ్రీ Y. సత్యనారాయణ గారు సిబ్బందితో కలిసి ప్రత్యేక దాడులు నిర్వహించి, గంజాయి అమ్మకం మరియు కొనుగోలు చేస్తున్న ఘటనలో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది.
*👉 కేసు వివరాలు:-*
06.12.2025 రాత్రి 10.00 గంటలకు నగరం పాలెం సీఐ సత్యనారాయణ గారికి పోలీస్ స్టేషన్ పరిధిలోని VIP రోడ్డులోని లాలుపురం వెళ్ళు డొంక సమీపంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి పక్కన ఉన్న ఖాళీ స్థలం వద్ద గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో ఎస్సై ప్రసన్న కుమార్ గారు, తన పోలీసు బృందంతో అక్కడికి చేరుకోగా, అక్కడ గుంపుగా కూడిన వ్యక్తులు పోలీస్ వారిని చూసి పారిపోతుండగా సీఐ గారు తన సిబ్బందితో 06 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి చేతుల్లో ఉన్న కవర్లను పరిశీలించగా వాటిలో గంజాయి ఉండటం గుర్తించి, వెంటనే వాటిని సీజ్ చేసి, పట్టుబడిన నిడుతులను పోలీస్ స్టేషన్ కు తరలించి, Cr.No: 458/2025
U/s 8(c) r/w 20(b)(ii)(A)(B) NDPS Act – Nagarampalem PS నమోదు చేయడం జరిగింది.ఈరోజు(07.12.2025) వెస్ట్ డిఎస్పీ అరవింద్ గారు కేసు వివరాలు వెల్లడించి, నిందితుల్ని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరుస్తామని తెలపడం జరిగింది.
👉 *అరెస్టు చేయబడిన నిందితులు, వారి వద్ద సీజ్ చేయబడిన గంజాయి వివరాలు :-*
1. గొర్ల కోటేష్ @ ఈశ్వర్, 28 సం., సంపత్ నగర్, గుంటూరు.
* *500 గ్రాములు*
2. కాకర్ల శ్రీకాంత్, 25 సం., వసంతారాయ పురం, గుంటూరు.
* *500 గ్రాములు*
3. బిశెట్టి కిరణ్ @ సాయి, 24 సం., నల్లచెరువు, గుంటూరు.
* *250 గ్రాములు*
4. షేక్ నాగుల్ షరీఫ్ @ షరీఫ్, 24 సం., వినోభానగర్, పాత గుంటూరు.
* *250 గ్రాములు*
5. అర్ధల అశోక్, 28 సం., A.T. అగ్రహారం, గుంటూరు.
* *250 గ్రాములు*
6. షేక్ అబ్దుల్ ఖయ్యూమ్ @ ఖయ్యూమ్, 20 సం., నల్లచెరువు, గుంటూరు.
* *250 గ్రాములు*
📌 ఈ కేసులో ఇంకా కొంతమంది నిందితులు గుర్తింపులో ఉన్నారనీ, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
*Note :- పైన తెలిపిన సీజ్ చేసిన గంజాయినీ మధ్యవర్తుల సమక్షంలో నియమానుసారం సీజ్ చేసి, గౌరవ న్యాయమూర్తి గారి వద్ద ఇన్వెంటరీ పూర్తిచేశారు.*
👉 *నిందితులపై గతంలో నమోదైన కేసులు....*
*1) A1 – గొర్ల కోటేష్*
* అమర్తలూరు PS – దోపిడీ
* రాజుపాలెం PS – దోపిడీ
* GRP PS – దోపిడీ
* నర్సిపట్నం PS – NDPS
* గుంటూరు ఎక్సైజ్ PS – NDPS
*2)A2 – కాకర్ల శ్రీకాంత్*
* నగరంపాలెం PS – దోపిడీ
* అరండల్ పేట PS – NDPS
*3)A3 – బిశెట్టి కిరణ్*
* అరండల్ పేట PS – NDPS
* మోతుగూడెం PS – NDPS
*4)A4 – షేక్ నాగుల్ షరీఫ్*
* అమర్తలూరు PS – దోపిడీ
* మోతుగూడెం PS – NDPS
*5)A5 – అబ్దుల్ ఖయ్యూమ్*
* లాలాపేట PS – NDPS
*👉 దర్యాప్తులో పాల్గొన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బంది :-* CI సత్యనారాయణ గారు, SI D. ప్రసన్న కుమార్ గారు, హెడ్ కానిస్టేబుళ్ళు ప్రసాధ్ బాబు మరియు దాసు, కానిస్టేబుళ్లు శ్రీనివాసు, ఉదయ్, నాగేశ్వరరావులు. నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరచిన వీరందరిని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారు అభినందించారు.
👉 కేసులోని నిందితుల్లో ఒకరైన కాకర్ల శ్రీకాంత్, ఇంజనీరింగ్ విద్యార్థి అయినప్పటికీ గంజాయి బానిసగా మారడం గమనార్హమని పోలీసులు తెలిపారు.
అందువల్ల జిల్లాలోని అన్ని కళాశాలలు తమ విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు తప్పనిసరిగా నిర్వహించాలి అని సూచించారు.
👉 గుంటూరు వెస్ట్ సబ్–డివిజన్ పరిధిలో గంజాయి విక్రయించినా, రవాణా చేసినా, సేవించినా లేదా కలిగి ఉన్నా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ శ్రీ K. అరవింద్ గారు హెచ్చరించారు.
#📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్


