#⚕️ప్రపంచ మధుమేహ దినోత్సవం🔵
ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం , శ్రీకాకుళం
మధుమేహంపై అవగాహన కల్పిస్తూ.. ఏటా నవంబర్ 14వ తేదీన ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని నిర్వహిస్తామని ఇంచార్జి వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మేరీ కేథరిన్ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ శివరంజని జెండా ఊపి ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సమస్యపై అవగాహన కల్పించేందుకు ఏటా ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు . దీనిద్వారా డయాబెటిస్‌పై పూర్తి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు .మధుమేహ నివారణ కోసం.. ఓ థీమ్‌ని ఫాలో అవుతూ ఉంటారు. అలాగే 2025కు గానూ.."మధుమేహం ముప్పు - అందరికి ఉందని చెప్పు "దీనిలో భాగంగా మధుమేహ సంరక్షణలో అసమానతలను పరిష్కరించడానికి.. అని చెప్పారు. ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు సహకారం అందించడమే లక్ష్యంగా ముందుకు రావాలనేది దీని ఉద్దేశం అని తెలిపారు.ప్యాంక్రియాస్ ద్వారా తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి జరగకపోతే.. లేదా ఇన్సులిన్ ఉత్పత్తిని సమర్థవంతంగా వినియోగించుకోలేకపోవడాన్నే మధుమేహం అంటారు. వైద్యుల సూచనలతో పాటు ఆరోగ్యకరమైన బరువు ఉండడం.. ప్రతిరోజూ అరగటం వ్యాయామం చేయడం, శారీరకంగా చురుకుగా ఉండడం చేయాలి. ఈ సందర్భంగా కార్యాలయంలోని డిప్యూటీ డి. యం.యచ్ .ఓ మేరీ కాథరిన్ గారు షుగర్ పరీక్షా చేయించుకుని షుగర్ పరీక్షలు ప్రారంభించారు ఆ తర్వాత కార్యాలయంలో ఉన్న ప్రోగ్రాం అధికారులు డాక్టర్ రాందాసుగారు,డాక్టర్ రవీంద్రగారు,డాక్టర్ జి.వి. లక్ష్మిగారు , డాక్టర్ సుజాతగారు, ఎస్ . ఓ రామ్ నాగేశ్వరరావు గారు,డి.యం.ఓ సత్యనారాయణ గారు డి .పి.ఓ మురళిగారు షుగర్ పరీక్షలు చేయిచుకున్నారు. ఈ కార్యక్రమంలో డి. యం.యచ్ .ఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పరీక్షలు చేయించుకున్నారు.
#🗞️నవంబర్ 14th ముఖ్యాంశాలు💬 #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #📅 చరిత్రలో ఈ రోజు


