#శ్రీ వినాయక వైభవం 🕉️ #గణేశ వైభవం #వినాయక చవితి స్పెషల్ #వినాయక మండపాలు #వినాయక చవితి
శ్రీవినాయక మండపంలో శ్రీబాలగంగాధరతిలక్‌గారు మరియు ఛత్రపతిశివాజీమహారాజువారి చిత్రపటాలు ఎందుకు పెట్టాలో మీకు తెలుసా..???
అసలు మన భారతదేశంలో సనాతన హైందవధర్మంలో ఏ పండుగకూ లేని విశిష్టత, ప్రత్యేకత శ్రీవినాయకచవితి ఉత్సవాలకు మండపములు వేసి స్వామివారి మూర్తి ప్రతిష్టచేసి, అదేవిధంగా దుర్గాదేవి నవరాత్రులలో కూడా అమ్మవారి మూర్తి ప్రతిష్టచేసి పూజలు చేసుకునే విధానం ఎప్పుడు మొదలైందో తెలుసా..???
భారతదేశమును బ్రిటిషువారు పరిపాలించే కాలంలో రోడ్లపై భారతీయులు ఇద్దరు, ముగ్గురు తప్ప సమూహంగా కనిపించడానికి వీలులేదని 144 సెక్షన్ అమలుచేసేవారు., ఎక్కువమంది కనిపిస్తే అరెస్టు చేయడం, కేసులు పెట్టడం చేస్తుండేవాళ్ళు.,
అటువంటి పరిస్థితులలో శ్రీబాలగంగాధరతిలక్‌గారి ఆలోచనలతో ప్రతి వినాయకచవితి పండుగ వచ్చేటప్పుడు శ్రీవినాయకచవితి ఉత్సవాలు నిర్వహించుకొనుటకు పర్మిషన్ తీసుకుని, పందిరివేసి వినాయకచవితి పూజలు నిర్వహిస్తూనే, అక్కడ ప్రజలందరూ సమావేశమయ్యే విధముగా తీర్చిదిద్దటంలో ఒక ఆయుధమే ఈ యొక్క పందిరి/మండపం., వినాయకచవితి పందిరి దగ్గర భారతీయులందరినీ పోగుచేసి బ్రిటిషు ప్రభుత్వంపై, వారి పాలనపై తిరగబడి పోరాటాలు ఎలా చేయాలనే విధానంపై అక్కడ చర్చించేవారు., ఆ విధంగా మన వినాయకచవితి పందిరితో బ్రిటిషు ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది..!
🙏👍🙌🤝🌹♥️🌺👌✌️👏