ShareChat
click to see wallet page
search
*అలసిన వానిని ఊరడించు మాటలు* 🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞 *సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన* *అనుదిన ధ్యానములు* 🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇 *🌷🌷సెప్టెంబరు 30🌷🌷* *"ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుచు నిరంతరము జీవించు చున్నాడు గనుక .. శక్తిమంతుడై* *యున్నాడు" (హెబ్రీ 7:25)* మన పరలోక ప్రధాన యాజకుడుగా, యేసుక్రీస్తుకు నాలుగంతల పరిచర్య కలదు. మొదటిగా, ఆయన మన పక్షముగా విజ్ఞాపన చేయును. రెండవది, మన పక్షముగా పరిపూర్ణమైన బలి గావించెను. మూడవది, దేవుని చిత్తమును తెలిసికొనుటకు ఆయన సహాయము చేయును. నాల్గవది, మన గొప్ప ప్రధాన యాజకుడుగా యేసు క్రీస్తు మనకు పరలోక ఆహారము నిచ్చును. మెల్కీసెదెకు ప్రధాన యాజకుడుగా అబ్రాహామునకు కనబడినట్లు ఆదికాం. 14: 18 లో చూచుచున్నాము. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను, ద్రాక్షారసమును తీసికొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అతడు ఎక్కడ నుండి వచ్చెనో ఎవరికీ తెలియదు. అతడు తండ్రి, తల్లి లేనివాడు. అతడు ఆది, అంతము లేనివాడు. అతడు, దేవుని కుమారునివలె ఉన్నాడు. అనగా దేవుడే మెల్కీసెదెకు రూపమును దాల్చి పరలోక ఆహారమును అబ్రాహామునకు తెచ్చి ఇచ్చినట్లుగా రుజువు చేయబడుచున్నది. ఇది యేసుక్రీస్తు శరీరమునకు, రక్తమునకు సాదృశ్యమైన ప్రవచనము. అబ్రాహాము పరలోకపు ఆహారమును తినుట ద్వారా అధికమైన శక్తిని పొంది, సొదొమ రాజు ద్వారా వచ్చిన శోధనను జయించగలిగెను. మనము ఆత్మీయ శక్తిని పొందుటకు పరలోకపు ఆహారము అవసరమై యున్నది. మన బాల్యములో, యౌవ్వనకాలములో మరియు వృద్దాప్యములో ఎదుర్కొను ప్రతి శోధనను జయించుటకు ఏర్పాటుచేసెను. "సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును" (1 కొరింతి. 10:13). మెల్కీసెదెకు యొక్క చేతినుండి పరలోకపు ఆహారమును పొందుట ద్వారా ఆ విజయము సాధ్యమయ్యెను. శోధన సమయములో మన బైబిలు జ్ఞానము మరియు స్వశక్తి మనకు సహాయము చేయలేవు. యేసుక్రీస్తు ప్రభువే కనికరముగల, నమ్మకమైన మన ప్రధాన యాజకుడు. హెబ్రీ 2:17,18 ల ప్రకారము విశ్వాసముతో మనము ఆయన యొద్దకు వెళ్ళినపుడు ఆయన పరిచర్య ద్వారా ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకు క్రమము చొప్పున శక్తిని పొందుదుము. ఆయన శత్రువు యొక్క కుతంత్రములన్నిటిపై విజయము నిచ్చును. *ఎవరైతే తమపై తాము లేక తమ బైబిలు జ్ఞానముపై, దీర్ఘకాలపు ఉపవాస ప్రార్ధనలపై ఆధారపడుదురో వారు ఆత్మీయముగా ఓడిపోయి గొడ్డుబారిన వారుగా నుండెదరు. అయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రధాన యాజకత్వము ద్వారా మేలు పొందగోరుదురో వారు ఆత్మీయముగా దినదినము బలపడుదురు*. మొదటిగా, యేసుక్రీస్తును మన రక్షకునిగా యెరుగుదుము. తరువాత మన ప్రభువుగా, రాజుగా తెలిసికొందుము. తరువాత ఆయనను ప్రధాన యాజకునిగా తెలిసికొందుము. మన అనుదిన జీవితములో ఆయన ప్రధాన యాజకత్వపు పరిచర్యను ఏ విధముగా ఉపయోగించుకొనవలెనో ప్రభువే మనకు బోధించును గాక! Please share 🙏🏼Praise the LORD.🙏🏼 #📝అనుదిన వాక్యము #⛪దేవుని వాక్యము ✝