షిర్డీ సాయబాబా
చెప్పిన విషయాలు పాటిద్దామా !
చాలమంది మేము సాయబాబా మందిరములో
108 ప్రదక్షిణాలు చేసాము
తొమ్మిది వారాల పూజలు చేశాము .అన్నదానానికి విరాళాలు ఇచ్చాము .సాయిసచ్చరిత్ర ప్రతిదినం పారాయణము చేస్తున్నాము .కానీ మా సమస్యలు, కష్టాలూ సాయబాబా తీర్చటం లేదు
అని వాపోతుంటారు .
ఏదో గబగబా మందిరం చుట్టూ తిరిగేసి ,పారాయణ పేరుతో గబగబా చరిత్ర చదివేసి ,హమ్మయ్య ! ఇవాల్టికి అయిపోయింది .ఇక భోజనం చేసేద్దాం
పండుకొందాం ,అను పద్ధతి ఉన్నవారి పూజలకు
మున్నగు కార్యక్రమాలకు బాబా ఎలా సంతృప్తి చెందుతారు
బాబా తన జీవితకాలంలో ఎన్నొ
సూక్తులు ,నీతులు చెప్పారు .ఆయనకు నిజమైన
పూజ అంటే ,ఆ సూక్తులు ,నీతులు పాటించడమే
ఉదాహరణకి బాబా " ఎవరితో గొడవలు పడవద్దు
వివాదాలకు అహంకారమే మూలకారణం " అని
చెప్పారు .ఎన్నొ సందర్భాలలో మనం అహంకారం
వీడనప్పుడు
మన పూజలు బాబా ఎలా స్వీకరిస్తారు ? బాబా మన నుంచి పూజలు కానుకలు కొరలేదు. బాబా చెప్పిన మాటలు చదివి ,అర్థం చేసుకుని ,అరిషడ్వార్గాలు జయించి
మన జీవితాన్ని సుగమము చేసుకోమని చెప్పారు
సాయిసచ్చరిత్ర సప్తాహం పారాయణం మొదలు పెట్టాలి అనుకొనే ముందు ఒకసారి సాయిసచ్చరిత్రను క్షుణ్ణంగా ఒకటికి రెండుసార్లు చదవండి .
బాబా బోధలు మనసులో ఉంచుకోండి
మనకు ఏ ఏ బోధలు చేశారో ఒక పెన్సిల్ తో
అండర్ లైన్ చేసుకొండి .ఆ బోధనలను ఒకటికి రెండుసార్లు చదువుకోండి .మనం బాబా చెప్పినట్లు ఉంటున్నామా ? లేదా ?అని ఆత్మపరిశీలన చేసుకొండి .ఉదాహరణకి
ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు ,వుంటే ఇవ్వాలి
లేదంటే లేదని చెప్పాలి
ఒకవేళ నీకు ఇవ్వడం ఇష్టం లేకుంటే ,ఆ విషయమే నెమ్మదిగా చెప్పు ,అరవడం దేనికీ ? అని బాబా ఒక సందర్భంలో
చెప్పారు .ఆ సంగతి మనం పాటిస్తున్నామా అని
ఆత్మ విమర్శన చేసుకోవాలి .
ఇలా బాబా చెప్పిన బోధలు పాటించడం మొదలెడితే ,సులభముగా
అందరూ అరిషడ్వార్గాలను జయించవచ్చు .
ఈ రకమయిన ప్రవర్తన అలవాటు చేసుకున్నప్పుడు ,
మన మాటలతో ,చేతలతో
ఇతరులకు హాని కలిగించనప్పుడు బాబా మనపట్ల సంతృప్తి చెందుతారు .మన గోడు వింటారు .మన బాధలు తీరుస్తారు . #🌅శుభోదయం #🕉 ఓం సాయిరామ్😇 #🙏🏼షిరిడి సాయి బాబా #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🎶భక్తి పాటలు🔱


