#'భగవద్గీత' సృష్టిలో ఏకైక దైవ గ్రంధం #భగవత్గీత #భగవత్గీత #భ గ వ ధ్గీ త #భగవత్ గీత సారాంశం
*సుఖజీవన గీత భగవద్గీత*
*డిసెంబర్ 01 సోమవారం గీత జయంతి సందర్భంగా...*
సకల జ్ఞానస్వరూపాలైన ఉపనిషత్తులను గోవులుగానూ, అర్జునుణ్ణి దూడగానూ చేసి శ్రీకృష్ణుడు పితికిన ఆవుపాల సారమే భగవద్గీత. శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన ఈ గీతాజ్ఞానమంతా 18 అధ్యాయాలుగా, పరమపదానికి సోపాన మార్గంగా విరాజిల్లుతోంది. ఎవరైతే సంసార సాగరాన్ని దాటాలనుకుంటున్నారో, అటువంటివారు గీత అనే ఈ నావనెక్కి సులువుగా ఆవలి ఒడ్డుకు చేరుకుంటారు. మోక్షస్థానాన్ని లక్ష్యంగా చేసుకున్న వారు ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కి పరబ్రహ్మాన్ని పొందుతారు.
"గీతా శ్రవణ పఠనాలు జరిగేచోట నేను సర్వదా వసింపగలను' అని భగవానుడు అర్జునుడితో చెప్పిన దాన్ని బట్టి గీతను చదివేచోట, వినేచోట భగవంతుని సహాయం శీఘ్రంగా లభిస్తుంది.
భగవద్గీతకు (1.8 అధ్యాయాలున్నట్లే) 18 పేర్లున్నాయి. అది 1. గీత 2. గంగ 3. గాయత్రి 4. సీత 5. సత్య 6.సరస్వతి 7. బ్రహ్మవిద్య 8, బ్రహ్మవల్లి 9. త్రిసంధ్య 10. ముక్తిగేహిని 11. అర్థమాత్ర 12 చిదానంద 13. భవఘ్ని 14. భ్రాంతినాశిని 15. వేదత్రయి 16. పర 17. అనంత 18. తత్త్వార్థ జ్ఞాన మంజరి.
గీత అంటే...: సాక్షాత్తూ విష్ణుదేవుడంతటి వాడితో పోల్చదగినవాడు వ్యాస మహాముని ఒక్కడే అలాంటి వ్యాసుని అనుగ్రహం వల్ల గీతాబోధనను సంజయుడు ప్రత్యక్షంగా వినగలిగారు. అలా భగవంతుని ద్వారా విన్నది విన్నట్లుగా సంజయుడు, లోకానికి అందించాడు. గీత అనే వదంలో '' అంటే త్యాగం, 'తే' అంటే తత్త్వ జ్ఞానం. అంటే త్యాగాన్నీ, తత్వజ్ఞానాన్నీ బోధించేదే గీత. అది భగవంతుని ముఖతః వెలువడింది కాబట్టి భగవద్గీత అయింది. గీతలో నిత్యజీవితంలో మానవుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి.
శ్రీకృష్ణపరమాత్మ గీతాబోధన చేయగా తొలుత విన్నవారు అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, అర్జునుని రథ ధ్వజం పై ఉన్న ఆంజనేయుడు.
గీతా మాహాత్మ్యాన్ని శివుడు పార్వతికీ, విష్ణువు లక్ష్మీదేవికీ, బ్రహ్మ సరస్వతికి చెప్పారు. త్రిమూర్తులే సతులకు గీతా మాహాత్మ్యాన్ని చెప్పుకున్నారంటే సామాన్యులమైన మనమెంత? కనుక భగవత్ప్రసాదమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలి. చదవలేనివారు వినాలి. స్నానం చెయ్యడం వల్ల శరీరంపైన ఉండే మాలిన్యం ఏ విధంగా తొలగిపోతుందో గీత అనే పవిత్ర గంగాజలంలో స్నానం చెయ్యడం వల్ల సంసారమనే మాలిన్యం తొలగిపోతుంది.
ఆధునిక జీవితంలో యుద్ధాలు లేకపోవచ్చు కానీ, జీవనయానం కోసం వేసే ప్రతి అడుగూ ఒక యుద్ధభేరి లాంటిదే. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అర్జునుడిలా, శ్రీకృష్ణునిలా అవతారం ధరించవలసిందే. కష్టాలు వచ్చినప్పుడు క్రుంగిపోకుండా, ఆనందం కలిగినప్పుడు పొంగిపోకుండా శాంతంగా, స్థిమితంగా ఆలోచించడం. ఎలాగో వివరించిన గ్రంథం ఇది. కాబట్టి దీన్ని మించిన జీవన విధానం, వ్యక్తిత్వ వికాసం మరొకటి లేదని చెప్పవచ్చు.
మనిషిలోని కోరికలనూ, బాధలనూ నశింపజేయడానికీ, సాటి మనిషి దుఃఖాన్ని తొలగింపజేయడానికీ గీతలోని ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క ఆయుధంగా, ఔషధగుళికగా వాడుకోవచ్చు.
యోగ, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో కూర్చిన గీతను జీవితమంతా అభ్యసించినప్పటికీ అంతం ఉండదు. చదివిన ప్రతిసారీ కొత్త అర్దాలు పుట్టుకొస్తుంటాయి. మనం తెలిసి కానీ, తెలియక కానీ చేసే పాపాలన్నీ గీతాపఠనం వల్ల తక్షణమే. నశించిపోతాయి. గీతా మకరందాన్ని సేవించడమే కాదు, అందులోని మంచిని ఆచరిద్దాం కష్టాల కడలి నుండి సుఖాల. తీరానికి చేరుద్దాం.
*https://whatsapp.com/channel/0029Va4YUC6DeONFF8EDwQ2V*


