#🗞️నవంబర్ 15th ముఖ్యాంశాలు💬
*డాక్టర్ పై కేసు.. సిగ్గుచేటు...*
*కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో మరింత ఉత్సాహంగా పనిచేస్తాం*
*కూటమి బెదిరింపులకు భయపడేది లేదు*
(న్యూస్, నరసన్నపేట)
వైద్య విద్యను అభ్యసించిన ఉన్నత విద్యావంతుడు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్యపై పోలీసులు అక్రమ కేసు బనాయించడం సిగ్గుచేటని వైకాపా నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు శనివారం పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య గట్టిగా ప్రశ్నించి, ప్రజాక్షేత్రంలో నిలదీస్తున్నారన్నారు. దీంతో నియోజకవర్గ టిడిపి నాయకుల వెన్నులో వణుకు మొదలైందన్నారు. ఆయన గొంతు నొక్కే ప్రయత్నం టిడిపి చేస్తోందని, ఇందులో భాగంగా పోలీసులను ప్రయోగించి అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. చైతన్య రాజకీయ జీవితంలో ఇది మొట్టమొదటి కేసు అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఆయనకు పార్టీ శ్రేణులు, నియోజకవర్గ ప్రజలు అండగా ఉంటారన్నారు. కృష్ణచైతన్య సారథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలు లోపించాయి అని, నరసన్నపేట పట్టణంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు పెరిగిపోయాయి అన్నారు. వాటి నియంత్రణకు పోలీసులు తీసుకున్న చర్యలు శున్యమన్నారు. వ్యాపారుల మీద గంజాయి బ్యాచ్ దాడులు చేస్తుంటే పోలీసులు ఏమి చేస్తున్నారు అని ప్రశ్నించారు. కృష్ణచైతన్య కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి టీడీపీ నాయకుల కళ్ళు కుట్టుకుంటున్నాయి అని అన్నారు. అందుకే ఆయనను వేధించాలి అని ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు, జెడ్పీటీసీ చింతు రామారావు, రాష్ట్ర పొందర కూరకుల విభాగం అధ్యక్షులు రాజపు అప్పన్న, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దండి జయప్రకాష్, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కల్లేపల్లి లక్ష్మణరావు, మండల యూత్ అధ్యక్షులు బుద్దల రాజశేఖర్ ,మండల బూత్ కమిటీ అధ్యక్షులు బబ్బోది ఈశ్వరరావు , మండల RTI విభాగం అధ్యక్షులు దుల్ల రమణ, మండల చేనేత విభాగం అధ్యక్షుడు మానేం శివ , మండల ఎస్సి సెల్ అధ్యక్షులు నాగవంశపు డేవిడ్,వైస్ ఎంపీపీ పాగోటి రాజారావు, సర్పంచ్ బురల్లి శంకర్, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి కోటిపల్లి శ్రీనివాస్, మండల ఉప అధ్యక్షులు నేతింటి రాజేశ్వరరావు ,మాజీ ఎంపిటిసి మార్పు విజయ్ కుమార్, మండల యూత్ సభ్యులు తోట భార్గవ్ , చల్ల తాతారావు, చిట్టి రవి, మండల కార్యవర్గ సభ్యులు పెరుమాళ్ళ తవిటి నాయుడు , యళ్ళ జగన్నాథం, పులసారి అప్పన్న , మండల నాయకులు పాల్గొన్నారు.
#🔵వైయస్‌ఆర్‌సీపీ #🟢వై.యస్.జగన్ #👊పొలిటికల్ ఫైట్స్🎤 #🆕Current అప్‌డేట్స్📢


