ShareChat
click to see wallet page
search
#శ్రీ శ్రీ శ్రీ గురు దత్తాత్రేయ శ్రీపాద శ్రీ వల్లభ దిగంబర #శ్రీ దత్త దివ్య క్షేత్రాలు: శ్రీ నృసింహ సరస్వతి స్వామి క్షేత్రం గానుగపూర్ (కర్ణాటక) 🙏 శ్రీ దత్త దివ్య క్షేత్రాలు: శ్రీ నృసింహ సరస్వతి స్వామి గానుగపూర్ (కర్ణాటక) 🙏 గానుగపూర్ (కర్ణాటక) — శ్రీ నృసింహ సరస్వతి స్వామి.........!! ఇది దత్తాత్రేయ స్వామివారి అవతారం అయిన శ్రీ నృసింహ సరస్వతి గారి క్షేత్రం. భక్తులకు ఆరోగ్యం, శాంతి, ఉద్యోగం, పిల్లల విద్య, వంశవృద్ధి, దోష పరిహారం వంటి అనుగ్రహాలు లభిస్తాయి. గానుగపూర్ క్షేత్ర ప్రత్యేకతలు..... తపస్సు చేసిన సంగమేశ్వర క్షేత్రం (భీమా – అమరజా నదుల సంగమం) నిర్గుణ పీఠ్ దత్త క్షేత్రాల్లో ఒకటి. “క్షేత్రంలో ఎవరైనా మూడు రోజులు విశ్రాంతి తీసుకుంటే, వారి కర్మ దోషాలు దూరమవుతాయి” అని పురాణాలు చెబుతాయి. ఇది శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క 2వ అవతార క్షేత్రం గానుగపూర్‌లో తప్పక చేయాల్సిన పూజలు..... కోటా లింగం కి అభిషేకం, ఉదయం స్నానం తర్వాత శివలింగంపై కొంచం పాలు, నీరు, బిల్వం ఉంచాలి. ఇది పూర్వజన్మ కర్మ దోషాలు తొలగించే మహా పరిహారం. పాదుకా సేవ (నిర్గుణ మఠం)...... స్వామివారి పాదుకలకు నమస్కారం చేసి "దిగంబర దత్త మహారాజ్ కీ జై" అని జపించాలి. అత్యంత శక్తివంతమైన సేవ. సంగమ స్నానం..... భీమా–అమరజా సంగమ స్నానం, అనారోగ్యం, శాప దోషాలు, కుటుంబ సమస్యలు తొలగుతాయి. అక్కడ ప్రతిరోజు పటించమని చెప్పే మంత్రాలు..... దత్తాత్రేయ గాయత్రి.... ఓం దత్తాయ విధ్మహే | అత్రేయాయ ధీమహి | తన్నో దత్తః ప్రచోదయాత్ || నృసింహ సరస్వతి మంత్రం... ఓం శ్రీ గురుదేవ దత్తం | ఓం నృసింహ సరస్వత్యాయ నమః || "దిగంబర దత్త మంగళం" దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర | దిగంబర దిగంబర నృసింహ సరస్వతి దిగంబర ||
శ్రీ శ్రీ శ్రీ గురు దత్తాత్రేయ శ్రీపాద శ్రీ వల్లభ దిగంబర - 496 496 - ShareChat