#ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: మాస శివరాత్రి ... విశిష్టత పరమశివునికి ఇష్టమైన రోజు #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శుభ కార్తీక మాసం 🪔🕉️🔱🪔శివకేశవుల పరమ పవిత్ర ఆధ్యాత్మిక మాసం 🙏🙏🙏 #శుభ కార్తీక మాసం - ఈ మాసంలో జరుపుకొనే పూజలు- నోములు - పండుగ లు
*మాస శివరాత్రి*
*ఈరోజు "మాస శివరాత్రి" ...*
ప్రతి నెల అమావాస్య ముందురోజు వచ్చే చతుర్ధశి తిధిని మాసశివరాత్రిగా జరుపుకుంటారు.
అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం.
శివుని జన్మ తిధిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి.
*మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి ?*
మహాశివుడు లయ కారకుడు. కనీనికా నాడీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారము లయానికి (మృత్యువునకు) కారకుడు కేతువు , అమావాస్య ముందు వచ్చే చతుర్ధశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు.
*చంద్రోమా మనస్సో జాతః*
అనే సిద్దాంతము ప్రకారము ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడూ జీవులపై ఈ కేతు ప్రభావము ఉండటము వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూపడము వలన జీర్ణ శక్తి మందగిస్తుంది.
తద్వారా మనస్సు ప్రభావితం అవుతుంది. తద్వారా ఆయా జీవులు ఈ సమయంలో మానసికముగా సమయమును కోల్పోవడమో , చంచల స్వభావులుగా మారడమో , మనోద్వేగముతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపములో ఉన్న ప్రజల యొక్క మనస్సు , ఆరోగ్యం , ధనం , ప్రాణములకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు.
అందుకే మనం గమనించవచ్చు ..,
అమావాస్య తిధి ముందు ఘడియాలలో కొందరి అనారోగ్యం మందగించండం లేదా తిరగబెట్టడం , ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణము ఇదే అని చెప్పవచ్చు.
కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంత మేర ప్రతి మాసము ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉన్నది.
*మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలి ?*
ఈ అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసము ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి.
ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకుని దగ్గరలోని శివాలయ దర్శనం చెయ్యాలి. అవకాశం ఉన్న వారు వారి శక్తి మేర 5 , 11 , 18 , 21 , 56 , 108 ఇలా ప్రదక్షణములు చేయవచ్చు.
అలాగే ఈ రోజు శివాలయములో పూజలో ఉంచిన చెరకు రసమును భక్తులకు పంచినచో వృత్తి అంశములో ఇబ్బందులను ఎదుర్కొనేవారికి అటువంటి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది.
అలాగే ఆరోజు ప్రదోష వేల శివునకు మారేడు దళములతో లేదా కనీసము గంగా జలముతో అభిషేకాది అర్చనలు చేయడము మంచిది.
ఇవేమీ చేయడానికి అవకాశము లేని వారు , ఆరోగ్యవంతులు , అలాగే గృహములో అశుచి దోషము లేని వారు ఈ రోజు ఉపవాసము ఉండి , మూడు పూటలా చల్లటి నీటితో వీలు అయినంత ఎక్కువ సమయం స్నానం చెయ్యాలి. మంచం మీద కాకుండా నేలపై పవళించాలి.
*మాస శివరాత్రిని జరుపుకోవడము వలన ఉపయోగములు ?*
ప్రత్యేకించి ఈ రోజు ను సశాస్త్రీయంగా జరుపుకోవడము వలన మన జాతకములోని క్షీణ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది.
సంతానలేమి సమస్యలు నుండి విముక్తి లభిస్తుంది.
వృత్తి అంశంలో ఉన్న ఆలస్యాలు , అవరోధాలు అంశంలో మార్పు కలుగుతుంది.
దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
ముఖ్యంగా మొండిగా , పెంకిగా , బద్దకంగా , మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈ రోజు ఉపవాసమును చేయించి దేవాలమునకు వెళ్ళే అలవాటును చేయించగల్గితే వారిలో కాలక్రమము లో ఖచ్చితముగా మార్పు వస్తుందని భావించవచ్చు.
మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
కావున మనం అందరం కూడా ఈ రోజు నుండి అవకాశం ఉన్నంత మేర ప్రతి మాస శివరాత్రిని సశాస్త్రీయంగా జరుపుకోవడము ద్వారా శుభములను పొందవచ్చు.
*🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*


