ShareChat
click to see wallet page
search
*మార్గశిర పౌర్ణమి దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు 🌹* అత్రిమహర్షి భార్య అనసూయాదేవి. తన పాతివ్రత్య మాహాత్మ్యం చేత ఆ మాత బ్రహ్మవిష్ణుమహేశ్వరులను శిశువులుగా చేసి ఆడించింది, పాలిచ్చింది. ముగ్గురుమూర్తులూ ఆ దంపతులకు కొడుకులయ్యారు.త్రిమూర్తుల సమిష్టిరూపంగా అత్రి, అనసూయల బిడ్డడైన శ్రీదత్తాత్రేయుడు అనాదిగా హైందవ జాతీయుల పూజలందుకుంటున్నాడు. విష్ణువు దత్తాత్రేయుడని శివుడే దుర్వాస మహర్షి అని, బ్రహ్మదేవుడు చంద్రుడనీ భావించడం కూడా సనాతన సంప్రదాయం. శ్రీ దత్తాత్రేయుణ్ణి పూజించడం త్రిమూర్తులను పూజించడమే. తెల్లవారు ఝామున స్నానం చేసి సంధ్యావందనాది నిత్యకృత్యాలను ఆచరించిన తరువాత శ్రీ దత్తాత్రేయుడిని షోడశోపచారాలలో అర్చించడం సంప్రదాయం. పవిత్ర నదులలో ఈ రోజున స్నానం చేసి ఆతరిని అనసూయను శ్రీదత్తాత్రేయుడిని పూజించడం విశేష వ్రాత. శ్రీ దత్తాత్రేయుని చెంత నిలబడి ఉండే గోమాత సకల చరాచర సృష్టికి ప్రతీక. ఆయనను పరివేష్టించి ఉండే శునక చతుష్టం - నాలుగు కుక్కలు - నాలుగు వేదాలకు ప్రతిరూపాలు. శునకం కాలభైరవుడు. __________________________________________ HARI BABU .G _________________________________________ #శ్రీ దత్త జయంతి శుభాకాంక్షలు #శ్రీ గురు పాదవల్లభ జయంతి శుభాకాంక్షలు 💐💐 దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర జై గురు దత్త #గురు పౌర్ణమి శుభాకాంక్షలు 1 #🙏🏻గురువారం భక్తి స్పెషల్
శ్రీ దత్త జయంతి శుభాకాంక్షలు - దీనబంధుం కృప సింధుం సర్వ కరణ కరణం సర్వ రక్షాకరం వందే స్కృతగామి సనోవతు:. రిశీస్సులు దత్తా త్రేయుడి అందరిపై కి ఉండాలని కోరుకుంటూ దత్త జయంతి శుభాకాంక్షలు దీనబంధుం కృప సింధుం సర్వ కరణ కరణం సర్వ రక్షాకరం వందే స్కృతగామి సనోవతు:. రిశీస్సులు దత్తా త్రేయుడి అందరిపై కి ఉండాలని కోరుకుంటూ దత్త జయంతి శుభాకాంక్షలు - ShareChat