#🗞️డిసెంబర్ 2nd ముఖ్యాంశాలు💬
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్
శ్రీకాకుళం,డిశంబరు,2: ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. మంగళవారం ఎల్.ఎన్. పేట మండలంలో ధాన్యం కొనుగోలు చేస్తున్న మిల్లులను ఆయన తనిఖీ చేశారు. మిల్లులో అనధికారికంగా ధాన్యం నిల్వలు ఉండరాదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు వద్ద ఇంటర్నెట్ కు సంబంధించి సాంకేతిక సమస్య ఉంటే వైఫైని వినియోగించుకోవాలని సూచించారు. తనిఖీలో ఎల్ఎన్ పేట తహసీల్దార్ జె. ఈశ్వరమ్మ, వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
#🆕Current అప్‌డేట్స్📢 #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰ఈరోజు అప్‌డేట్స్ #🟨నారా చంద్రబాబు నాయుడు


