ShareChat
click to see wallet page
search
#నీవే సర్వం ... కృష్ణ ... నీవే నా సర్వం ... కృష్ణా ... #నీవే సర్వం ... కృష్ణ ... నీవే నా సర్వం ... కృష్ణా ... #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 *ప్రేమ భావన* రెండక్షరాల చిన్న పదం 'ప్రేమ'. రెండు హృదయాల మధ్య మొలకలా అంకురించి, విక సించి, వటవృక్షమై వ్యాప్తి చెంది, అంతా తానై ఉండే సమ్మోహకం అది. భౌతిక రూపం లేనిది, మనసులకు గోచరించేది ప్రేమ! మనుషులకు ప్రేమ- ఆత్మవిశ్వాసమిస్తుంది. అంతులేని ధైర్యాన్నిస్తుంది. తగినంత బలం కలిగిస్తుంది. భయాన్ని, పిరికితనాన్ని, జంకును, ఆత్మన్యూనతను అది దూరం చేస్తుంది. ప్రేమే నిత్య నూతనోత్సాహం ప్రసా దిస్తుంది. జీవితం పై అనేక ఆశల్ని పెంచు తుంది. దాని ఘనత అటువంటిది. మానవ జీవితంలో ప్రేమదే అగ్రస్థానం. ఆప్యాయంగా మాట్లాడటం, మనసులు పంచు కోవడం- గొప్ప శక్తినిస్తాయి. తన కోసం ఆలో చించే ఒక వ్యక్తి ఉన్నారన్న భావన- ప్రేమ వల్ల ఏర్పడుతుంది. సమాజంపై అది వివిధ కోణాల్లో ప్రసరిస్తుంది. తల్లీపిల్లలు, అన్నద మ్ములు, అక్కచెల్లెళ్లు- ఇలా ప్రేమకు పలు పార్శ్వాలు! సృష్టిలో అమ్మప్రేమకు సాటి మరేదీ లేదు. అహర్నిశలూ బిడ్డల క్షేమానికి ఆరాటపడే ఆమె ప్రేమను కొలిచే సాధనాలు లోకంలోనే లేవు. యౌవనంలో ఇరు హృదయాల్లో పుట్టే ప్రేమకు విశిష్ట స్థానం ఉంది. అది తాత్కాలిక వ్యామోహం లేదా ఆకర్షణగా మిగిలి, జీవితాల్ని ఛిద్రం చేయకూడదు. కులమతాలకు అతీతమైన సమాజ నిర్మాణా నికి ప్రేమ దోహదపడుతుంది. అది నిర్మల మైనది, నిజాయతీతో కూడినది అయినప్పుడు- పవిత్రమైన వివాహ బంధం ఏర్పడుతుంది. ఆ దాంపత్య బంధమే ఆరోగ్యకర సమాజానికి మూలం. బిడ్డలు విలువలతో పెరగడానికి ప్రేమే ముఖ్య కారణమవుతుంది. భవిష్యత్ సమాజం ఆదర్శవంతంగా కొనేందుకు పునాది- ప్రేమ. రూపుదిద్దు ప్రేమించి, ప్రేమను పొంది, జీవితాన్ని ఫల ప్రదం చేసుకొన్న వారెందరో పురాణాల్లో కని పిస్తారు. రుక్మిణీ కృష్ణులు, దమయంతీ నల చక్రవర్తులు, శకుంతలా దుష్యంతులు, సుభద్రార్జునులు, శశిరేఖా అభిమన్యులు... ఇలా ఎందరో! తమ ప్రేమకు ఎన్ని అవరో థాలు కలిగినా, వారు ఎంతమాత్రం చలించ లేదు. ఆటంకాల్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. కోరుకున్నవారిని వివాహమాడారు. అనంతరం ఎదురైన కష్టనష్టాల్నీ సహనంతో భరించి తమ బంధాన్ని దృఢతరం చేసుకున్నారు. ప్రగాఢ ప్రేమకు పర్యవసానం చక్కటి వివాహ బంధ మేనని చాటారు. అటువంటి వారి నడవడిని నేటి యువత ఆదర్శంగా తీసుకుంటే-ప్రేమలో కక్షలు, దాడుల ప్రసక్తే ఉండదు. పెళ్లితో ప్రేమ పర్వం ముగిసిపోకూడదు. ముగిస్తే, అది తాత్కాలిక ప్రేమే అవుతుంది. నిజమైన ప్రేమలో హక్కులు, అధికారాలు, హెచ్చుతగ్గులకు తావు లేదు. కుటుంబంలో, సమాజంలో స్త్రీ పురుష సమానత్వ స్థాపనకు ప్రేమే దోహదపడుతుంది. ప్రేమించగల సహ జసిద్ధమైన గుణం మనిషిలో ఉంటే, అదే అతడిలో విశాల దృక్పథాన్ని పెంచుతుంది. సాటివారి సమస్యల పట్ల సానుభూతి కలిగి ఉండటమూ అతడి స్వభావం కావాలి. ఈ విశ్వం ఒక పెద్ద వృక్షం. దీనికి 'ప్రేమ' అనే పూలు పూయాలి. పరిమళాల్ని అంతటా వ్యాపింపజేయాలి. ప్రేమ భగవత్ స్వరూపం. ప్రేమించే ప్రతి హృదయంలోనూ భగవంతుడు స్థిర నివాసం ఉంటాడు. పచ్చని చెట్లు, రంగుల పూలు, గల గలల సెలయేరు- ఇలా వింత సోయగాల ప్రకృతిని చూస్తే ఎంత ఆనందం కలుగు తుందో, మనుషుల్ని మనుషులుగా చూసిన ప్పుడూ అంతే ఆహ్లాదం వెల్లివిరుస్తుంది. మానవ జీవితం ఉత్కృష్టమైనది. అనుభూ తులు, భావోద్వేగాలు, భాష, వ్యక్తీకరణ... మనిషికే సాధ్యం. జీవితం యాంత్రికం కారాదు. కాలం బరువుగా గడవకూడదు. ఏ రోజుకు ఆరోజే సరికొత్తగా ఉండాలి. అను భూతుల్ని పంచుకుంటూ, ఆనందాల్ని పెంచు కుంటూ, విశ్వమానవ ప్రేమను పెంపొందిం చుకుంటూ- ముందుకు సాగాలి మనిషి! *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
నీవే సర్వం ... కృష్ణ ... నీవే నా సర్వం ... కృష్ణా ... - ShareChat