2019-2024 మధ్య జగన్ పాలనలో రాష్ట్ర జీఎస్డీపీ రూ.7 లక్షల కోట్లకు పైగా నష్టపోయింది. ప్రతి సంవత్సరం లక్ష-లక్షన్నర కోట్లు పెరగాల్సిన జీఎస్డీపీ తగ్గిపోవడంతో రాష్ట్ర సొంత ఆదాయంలో రూ.70 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. గత ప్రభుత్వం సక్రమంగా పనిచేసి ఉంటే ఈ ఐదేళ్లలో అదనంగా రూ.72 వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు వచ్చేవి.
పక్కనే ఉన్న తెలంగాణతో పోల్చితే తేడా మరింత స్పష్టమవుతుంది. 2014-19 మధ్య ఏపీ జీఎస్డీపీ వృద్ధి రేటు 13.21 శాతం కాగా, తెలంగాణది 13.5 శాతం. అయితే జగన్ పాలన రాగానే 2019-24 మధ్య ఏపీ జీఎస్డీపీ వృద్ధి రేటు 9.1 శాతానికి పడిపోయింది. తెలంగాణ 11 శాతం వృద్ధితో దూసుకెళ్లింది. ఫలితంగా తలసరి ఆదాయంలో ఏపీ రూ.2.66 లక్షల వద్దే ఉండగా, తెలంగాణ రూ.3.87 లక్షలకు చేరింది.
#🎯AP రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📰జాతీయం/అంతర్జాతీయం #📰ప్లాష్ అప్‌డేట్స్

