#📢ఆగష్టు 19th అప్‌డేట్స్📰 #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #🔴బలపడనున్న అల్పపీడనం..ఈ జిల్లాలకు హై అలెర్ట్⛈
అంబేద్కర్ కోనసీమ...
ముమ్మిడివరం...
లంక గ్రామాలకు వరద ముప్పు..
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో, అమలాపురం ఆర్.డి.ఓ. మాధవి ముమ్మిడివరం మండలంలోని గరజాపులంక మరియు కూనాలంక గ్రామాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు...
వరద పరిస్థితిని అంచనా వేయడానికి ఆర్.డి.ఓ. మాధవి వెంట రెవెన్యూ, వైద్య, విద్యుత్ శాఖల అధికారులు కూడా ఉన్నారు. వరద ముంపును ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ఆమె అధికారులకు సూచనలు ఇచ్చారు....
ఈ పర్యటనతో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సహాయక చర్యలు అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందని అధికారులు తెలిపారు...
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,
అవసరమైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేయాలి,
నిత్యావసరాలు, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలంటూ అధికారులకు అదేశాలు జారీచేసారు..


