ShareChat
click to see wallet page
search
*"భక్తుల ఇంటికి బాబా వస్తూనే వుంటారు పిలిచిన తలచిన*"..!! బాబాను అమితంగా ఆరాధించే భక్తులు తమ ఇంట్లో జరిగే శుభకార్యాలకు ఆయనని ఆహ్వానించేవారు. ఆయన తప్పక రావలసిందేననీ తమ ఇంట్లో భోజనం చేసి వెళ్లవలసిందేనని పట్టుపడుతూ వుండేవారు. వేడుక జరుగుతోన్న ప్రదేశంలో ఆయన పాదం మోపితే అంతకుమించిన అదృష్టం లేదని అంటుండేవారు. బాబా మాత్రం చిరునవ్వునే సమాధానంగా ఇస్తూ ఉండేవాడు. ఒకసారి ఒక భక్తుడు మశీదులో కూర్చున్న బాబాను దర్శించుకుంటాడు. కొన్నిరోజుల క్రితం జరిగన అతని కూతురి వివాహాన్ని గురించి బాబా ప్రస్తావిస్తాడు. తన కూతురు వివాహం బాగానే జరిగిందని ఆ భక్తుడు చెబుతాడు. తాను స్వయంగా వచ్చి ఆహ్వా నించినా బాబా రాకపోవడం పట్ల తన మనసు ఎంతగానో నొచ్చుకుందని అంటాడు. భోజనం వడ్డించిన తొలి విస్తరిని బాబాకి అన్నట్లుగా ప్రత్యేకంగా తీసి, ఆ తరువాతే అందరికీ వడ్డన చేశామని అంటాడు. అలా వడ్డించబడిన తొలివిస్తరిని ఏంచేశారని అడుగు తాడు బాబా. బంధుమిత్రులకు తాను వడ్డన చేస్తుండగా ఒక ఫకీరు వచ్చాడనీ, తన భార్య ఆయనకి ఆ విస్తరిని అందించగా జోలె లో వేసుకుని వెళ్లాడని చెబుతాడు. బాబానే ఆ రూపంలో వచ్చి తమ ఇంటి భోజనాన్ని స్వీకరించాడని తాము సంతోషించామని అంటాడు. కానీ బాబా వస్తే తమకి ఇంకా సంతృప్తిగా ఉండేదని అంటాడు. ఫకీరుగా ఆ ఇంటికి వచ్చిందీ తొలివిస్తరిని అందు కున్నది తానేనని చెబుతాడు బాబా. తాను ఈ రూపంలో మాత్రమే ఉంటానని అతను అనుకోవడం వలన గుర్తించలేక పోవడం జరిగిందని అంటాడు. తన భక్తులు ప్రేమానురాగాలతో ఆహ్వానిస్తే తాను ఏదో ఒక రూపంలో తప్పకవస్తాననీ, ఆశీస్సులను అందజేస్తానని చెబుతాడు. దాంతో ఆ భక్తుడు ఆనందంతో పొంగి పోతూ ఆయన పాదాలపై వాలిపోతాడు. "శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై" #🎶భక్తి పాటలు🔱 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏼షిరిడి సాయి బాబా #🕉 ఓం సాయిరామ్😇 #🌅శుభోదయం
🎶భక్తి పాటలు🔱 - ShareChat